టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఓ గొప్ప స్దానం ఉంది. ప్రజెంట్ హీరోలు ఎలా ఉన్నా కానీ, ఒకప్పుడు నాగేశ్వరరావు తన నటనతో, మాట తీరుతో..మంచి మనసుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అలా సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఇంటి పేరును కంటిన్యూ చేస్తూ..ఆ తరువాత నాగార్జున..ఆ తరువాత నాగ చైతన్య, అఖిల్ నెట్టుకోస్తున్నారు.
నాగార్జున నాన్న పేరు నిలబెట్టిన..ఈ యంగ్ హీరోలు మాత్రం ఇంకా సెటిల్ అవ్వలేదు. కాగా, ఇప్పుడిప్పుడే అఖిల్ , చై..దారిలోకి వస్తున్నారు. అఖిల్ ఏమో ఏజెంట్ తో హిట్ కొట్టడానికి రెడీగా ఉంటే..చైతన్య “ధ్యాంక్యూ” పై ఆశలు పెట్టుకుని ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా దిల్రాజు బ్యానర్లో చైతు నటించిన థ్యాంక్ యు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లో చైతు చెప్పిన డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
‘నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. చైతు చెప్పిన ఈ డైలాగ్ తన మాజీ భార్యను ఉద్దేశించి చెప్పిందే అన్న చర్చలు బాగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో రానా దగ్గుబాతి పెట్టిన కామెంట్ ఇంకా హీట్ పెంచింది. చై ట్వీట్ కి రిప్లై ఇస్తూ..” నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్.. సూపర్ టీజర్ గాయ్” కామెంట్ చేసాడు .
ఇక దీంతో రానా కామెంట్స్ సమంతని మైండ్ లో పెట్టుకునే అనుంటాడు..సామ్ వెళ్లిపోయాక నువ్వు ఆల్ రెడీ కరెక్ట్ గా అయిపోయావు అనే దాని మీనింగ్ అంటూ వైరల్ చేస్తున్నారు. మరికొందరు అయితే చై ని ఇబ్బంది పెట్టడానికే ఇలా చేశావ్ అంటూ మండిపడుతున్నారు. రానా క్యాజువల్ గా విషెష్ చెప్పినా ఈ కామెంట్ ని సైతం సమంత, చైతు డైవర్స్ మ్యాటర్ లో కలిపేస్తున్నారు జనాలు. దీంతో “ధ్యాంక్యూ”సినిమాకి బోలెడు పబ్లిసిటీ వచ్చేసింది .
Nuvvu already sari aiyipoyyavu brother 😝 superb teaser guy! Best wishes @Vikram_K_Kumar @RaashiiKhanna_ https://t.co/9s6qhMpLCx
— Rana Daggubati (@RanaDaggubati) May 26, 2022