మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కమర్షియల్ సినిమాలకు పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. యాక్షన్ సీన్లు క్లిక్ అయితే చాలు హీరో ఎవరు అన్నది పట్టించుకోకుండా మనవాళ్లు సినిమాను హిట్ చేసి పడేస్తారు. ఇక తమిళ హీరోలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ లిస్టులోనూ సూర్య బ్రదర్స్ సూర్య, కార్తీ కూడా ఉంటారు. వీళ్లు క్రమం తప్పకుండా తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
చాలా తక్కువ టైంలోనే వీరు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కార్తీ తెలుగులో రిలీజ్ చేస్తోన్న సినిమాల టైటిల్స్ పాత తెలుగు సినిమాల టైటిల్స్‌తో రావడమో లేదా ఆ టైటిల్స్‌ను అనుకరించి ఉండడమో జరుగుతూ వస్తోంది. అలా కార్తీ పెట్టుకున్న కొన్ని సినిమాల టైటిల్స్ చూద్దాం.
కాష్మోరా :
నయనతార హీరోయిర్‌గా కార్తీ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే 1986లో రాజేంద్రప్రసాద్ – భానుప్రియ జంటగా నటించిన కాష్మోరా టైటిల్‌నే ఈ సినిమాకు వాడుకున్నారు.
చిన బాబు :
2019లో కార్తీ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రైతు గొప్పదనం చెపుతూ ఈ సినిమా తీశారు. ఇదే టైటిల్‌తో 1988లో నాగార్జున – అమల జంటగా ఓ సినిమా వచ్చింది.
ఖైదీ :
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు – మాధవి జంటగా వచ్చిన అలనాటి బ్లాక్‌బస్టర్ టైటిల్‌ను మళ్లీ కార్తీ రిపీట్ చేశాడు.
దొంగ :
ఇదే టైటిల్‌తో చిరంజీవి ఓ సినిమా చేయగా.. సూపర్ హిట్ అయ్యింది. ఇక 2019లో కార్తీ కూడా ఇదే టైటిల్‌తో సినిమా తీశాడు. ఈ సినిమాలో సూర్య భార్య జ్యోతిక కార్తీకు అక్క పాత్రలో కనిపించింది.
ఖాకీ :
ఖాకీ టైటిల్‌తో గతంలో తెలుగులోనే చాలా సినిమాలు వచ్చాయి. 2018లో కార్తీ ఇదే టైటిల్‌తో మళ్లీ సినిమా చేశాడు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయ్యింది.
సుల్తాన్ :
నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. కార్తీ ఇదే టైటిల్‌తో గతేడాది సినిమా చేశాడు. రష్మిక హీరోయిన్‌గా నటించింది.
సర్దార్ :
సీనియర్ ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్స్‌ను అనుకరించేలా కార్తీ సర్దార్ సినిమా చేశాడు.
మల్లిగాడు :
ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించగా కార్తీ, ప్రియమణి ఇద్దరికీ జాతీయ అవార్డులు వచ్చాయి.
దేవ్ :
కార్తీ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ సినిమా వచ్చింది. ఇక శ్రీహరి హీరోగా నటించిన దేవా సినిమా టైటిల్‌ను పోలి ఉండేలా దేవ్ సినిమా టైటిల్ పెట్టారు.
చెలియ :
గౌతమ్ మీనన్, మాధవన్ – అబ్బాస్ కాంబినేషన్లో అప్పట్లో చెలి సినిమా వచ్చింది. అదే టైటిల్ ను గుర్తుచేస్తూ కార్తీ – మణిరత్నం చెలియా సినిమా తెరకెక్కించారు.