ఒక సినిమాకు ఓకే చెప్పేముందు ఎలాంటి హీరో అయినా ముందు కథ చూస్తారు. ఆ తర్వాతే దర్శకుడు, నిర్మాత.. రెమ్యునరేషన్ చూస్తారు. కెరీర్లో ఎదగాలి.. మన హిట్ సినిమాలు పడాలి… ప్రేక్షకులను శాటిస్పై చేయాలి అనుకునే హీరోలు ఎవ్వరూ ముందు రెమ్యునరేషన్ గురించి ఆలోచించనే చించరు. కథ నచ్చాలి.. ఆ తర్వాత దర్శకుడు ఎవరన్నది చూస్తారు. అయితే టాలీవుడ్లో ముఖం ముడతలు పడిపోయిన ముసలోడికి దగ్గరైపోతోన్న ఓ సీనియర్ హీరోకు మాత్రం ముందుకు కథ.. కాకరకాయ ఏంటన్నది పట్టించుకోవడం లేదు.
రెమ్యునరేషన్ విషయంలో ఆ హీరో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడట. గతంలో ఐదారు ప్లాపులతో పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హిట్ వచ్చిన ప్రతిసారి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోయిన ఆ సీనియర్ హీరో ఇప్పుడు మరోసారి ఆ రేటు సవరించేశాడట. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్లాపులు వస్తున్నా కూడా ప్రతి సినిమాకు రేటు పెంచుకుంటూ పోతూ నిర్మాతలను చివరకు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారిపోయాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ హీరో నటించిన ఓ సినిమా ఈ యేడాది రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఆ సినిమాకు ముందు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ కంటే మరో రు. 2 కోట్లు ఎక్కువ తీసుకున్నాడు. అదేమని నిర్మాత అడిగితే సినిమాకు బిజినెస్ ఎక్కువ జరిగింది.. అందుకు నా క్రేజే కారణం.. ఆ రు. 2 కోట్లు ఇస్తే తప్పా నేను డబ్బింగ్ చెప్పనని కండీషన్ పెట్టాడట. దీంతో నిర్మాత గొడవ ఎందుకు ? సినిమా రిలీజ్ ముందు ఆగిపోతుందని ఆ డబ్బు ఇచ్చి మరీ డబ్బింగ్ చెప్పించుకున్నాడు.
ఇక తాజాగా ఆ హీరో నటిస్తోన్న మరో సినిమా కూడా సెడన్‌గా ఆగిపోయింది. సినిమా చాలా వరకు పూర్తయినా మనోడి రెమ్యునరేషన్ ఫుల్‌గా చేతికి అందలేదట. ఇలాంటి టైంలో ఏ హీరో అయినా డబ్బింగ్ చెప్పడం ఆపేస్తారు. కానీ ఈ హీరో మాత్రం డబ్బింగ్‌తో పాటు రెండు వారాల షూటింగ్ కూడా పెండింగ్‌లో పెట్టేశాడట. దీంతో ఇప్పుడు నిర్మాతలు ఆ హీరోతో సినిమా అంటేనే భయపడుతున్నారు.
ఆ హీరోతో సినిమా అంటే గాల్లో దీపం పరిస్థితి మాదిరిగా తయారైంది. దీంతో మనోడు ప్రస్తుతం నటిస్తోన్న సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేసేశారు. అయితే నిర్మాతలు ఈ బాధలు పైకి చెప్పుకోలేరు కాబట్టే పోస్ట్ ప్రొడక్షన్ లేట్.. ఏదో సాకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ సీనియర్ హీరో మరో నాలుగేళ్ల తర్వాత తన కెరీర్ ముగిసినట్టే అని డిసైడ్ అయిపోయాడట. అందుకే ఇప్పుడు ఉన్నంతలో పిండేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయి విలువలను పక్కన పెట్టేశాడనే అంటున్నారు.