టాలీవుడ్‌లో బడా ఫ్యామీలీలు అన్నింటికి పెద్ద బ్యానర్లే ఉన్నాయి. టాలీవుడ్‌కు మూలస్తంభాలుగా ఉన్న కుటుంబాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీకి ముందు రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ ఉండేది.. ఏఎన్నార్ ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఇక రామానాయుడు కుటుంబానికి సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. చిరంజీవి ఫ్యామిలీకి ముందు గీతా ఆర్ట్స్ ఉండేది. ఆ తర్వాత తరాలు మారడంతో ఒకే ఫ్యామిలీ నుంచి రెండు, మూడు బ్యానర్లు కూడా పుట్టుకు వచ్చాయి.
మెగా ఫ్యామిలీ నుంచి చిరు తనయుడు రామ్‌చరణ్ కొణిదెల ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇక నాగబాబుకు అంజనా ప్రొడక్షన్స్‌తో పాటు మన్యం ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లు ఉండేవి. ఇక మోహన్‌బాబు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు చేస్తే ఆయన తనయుడు విష్ణు 24 ఫ్రేమ్స్ బ్యానర్‌పై సినిమాలు తీశాడు. ఇక నాగార్జున ఫ్యామిలీ నుంచి సుశాంత్ ఫ్యామిలీ నాగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.
ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో తన సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు తీశాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడు మృతి చెందడంతో ఆ కుమారుడి పేరుతోనే రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ ఏర్పాటు అయ్యింది. ఎన్టీఆర్ చనిపోయాక కూడా ఇదే బ్యానర్లో బాలయ్య హీరోగా కూడా కొన్ని సినిమాలు వచ్చాయి.
ఆ తర్వాత హరికృష్ణ సొంతంగా ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో మూడో తరం హీరో కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. తాను సొంతంగా నటిస్తూ ఈ బ్యానర్ మీదే చాలా సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రవితేజతో కిక్ 2, ఎన్టీఆర్‌తో జైలవకుశ లాంటి సినిమాలు కూడా చేశారు.
ఇక బాలయ్య తన పేరుమీద ఎన్‌బీకే ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి ఒకటి రెండు సినిమాలు చేశారు. ఆ సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో బాలయ్య మళ్లీ నిర్మాణం వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను మాత్రం భాగస్వామ్యంతో ఆయనే నిర్మించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో బ్యానర్ ఏర్పాటు అవుతోంది. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో ఇప్పుడు కొత్త బ్యానర్ ఏర్పాటు అవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ నిర్మాణ సంస్థ తన బ్యానర్ గురించి పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
ఈ బ్యానర్ బాలకృష్ణ తన తల్లి బసవరామతారకం పేరుతో ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే ఇందులో ఫస్ట్ సినిమాను ఎవరితో నిర్మిస్తారు ? ఎవరు దర్శకత్వం వహిస్తారు ? అన్న విషయాలపై 28న లేదా ఆ తర్వాత క్లారిటీ రానుంది. బాలయ్యకు తన తల్లి అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె పేరు మీద క్యాన్సర్ స్థాపించి దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు ? ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆమె పేరు మీదే బ్యానర్ ఏర్పాటు చేస్తున్నట్టు టాక్ ?