Moviesత‌న‌ను బాల‌య్య వాట‌ర్ బాటిల్‌తో కొట్ట‌బోయాడు.. ఏం జ‌రిగిందో చెప్పిన 30...

త‌న‌ను బాల‌య్య వాట‌ర్ బాటిల్‌తో కొట్ట‌బోయాడు.. ఏం జ‌రిగిందో చెప్పిన 30 ఇయ‌ర్స్ పృథ్వి..!

బాల‌య్య భోళాశంక‌రుడు.. ఆయ‌న‌ది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం. ఆయ‌న పైకి క‌నిపించినంత గాంభీర్యంగా అయితే ఉండ‌రు. బాల‌య్య షూటింగ్ టైంలో కాని.. ఆయ‌న‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కాస్త అతి చేసిన ఒక‌రిద్ద‌రిపై చేయి చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు. అయితే ఎదుటి వ్య‌క్తి వ‌ల్ల పలువురు ఇబ్బంది ప‌డడం ఆయ‌న‌కు న‌చ్చ‌దు. అంతే త‌ప్పా ఆయ‌న్ను ద‌గ్గ‌ర నుంచి చూస్తే ఆయ‌న ఎంత గొప్ప మ‌నిషో అర్థ‌మ‌వుతుంద‌ని చాలా మంది చెప్పారు.

ఇక గ‌త ఆరు నెలలుగా అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌, అన్‌స్టాప‌బుల్ షోల త‌ర్వాత బాల‌య్య రేంజ్‌, క్రేజ్ అయితే మామూలుగా లేదు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ సినిమా చేస్తోన్న బాల‌య్య ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాల‌య్య‌తో క‌లిసి కొన్ని సినిమాలు చేసిన 30 ఇయ‌ర్స్ పృథ్వి బాల‌య్య వ్య‌క్తిత్వం గురించి ప‌లు విష‌యాలు చెప్పాడు.

బాల‌య్య‌ది చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని.. ఐదు త‌రాల పాటు కూర్చొని తిన్నా త‌ర‌గ‌ని ఆస్తి ఉన్నా కూడా ఆయ‌న మామూలు ఇన్నోవా కారులో వెళ‌తాడ‌ని చెప్పారు. బాల‌య్య‌ది సింపుల్ సిటీ అని.. హంగామాలు, ఆర్భాటాలు చేసేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌రు అని చెప్పారు. బాల‌య్య కేరోవ్యాన్‌లో ఉండ‌ర‌ని.. కేవ‌లం మేక‌ప్ వేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఆయ‌న కేరోవ్యాన్‌లో ఉంటార‌ని.. ఆ త‌ర్వాత వ‌చ్చి ఎంత ఎండ ఉన్నా కూడా బ‌య‌ట చెట్టు కిందే కూర్చుంటార‌ని పృథ్వి చెప్పారు.

బాల‌య్య లాంటి వ్య‌క్తే అంత సింపుల్‌గా ఉంటే.. ఇక మ‌నం ఎంత సింపుల్‌గా ఉండాల‌ని పృథ్వి ప్ర‌శ్నించారు. అలాగే ఆయ‌న‌తో డిక్టేట‌ర్‌, లెజెండ్ లాంటి హిట్ సినిమాల్లో న‌టించాన‌ని.. డిక్టేట‌ర్ శ‌త‌దినోత్స‌వం ఫంక్ష‌న్‌లో బాల‌య్య వాట‌ర్ బాటిల్ పుచ్చుకుని కొట్టేందుకు నా వెంట ప‌డ్డారంటూ నాటి స‌ర‌దా సంఘ‌ట‌న గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా 100 రోజుల ఫంక్ష‌న్ విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని చీపురుప‌ల్లిలో జ‌రిగింది.

బాల‌య్య ముందుగా ఓ ప‌ల్లెటూర్లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్లార‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు ఫంక్షన్లో బాల‌య్య డైలాగులు, పాట‌లు ప్లే చేసిన వారు బాల‌య్య వ‌చ్చే టైంలో పృథ్వి చెప్పిన డైలాగులు ప్లే చేస్తున్నార‌ట‌. దీంతో స‌ర‌దాగా బాల‌య్య వాట‌ర్ బాటిల్ పుచ్చుకుని త‌న‌ను కొట్టేందుకు వెంట ప‌డ్డార‌ని చెప్పారు. ఎవ‌రు ఏ ఇబ్బందుల్లో ఉన్నా వెంట‌నే స్పందించే గుణం బాల‌య్య‌ది అంటూ ఆకాశానికి ఎత్తేశాడు పృథ్వి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news