Moviesఆగష్టు 11 న పోటీకి సై...ఎవరు ముందో....

ఆగష్టు 11 న పోటీకి సై…ఎవరు ముందో….

ఆగష్టు 11 సినీ జనానికి పెద్ద పండగ రోజు ఎందుకు అంటే ఆ రోజు విడుదల అవుతున్న సినిమాలని ఆ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్లను బట్టి అవి ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్ధమవుతుంది. చాలా గ్యాప్ తర్వాత తేజ నేనే రాజు నేనే మంత్రితో వస్తుంటే, నితిన్ లై తో హను రాఘవపూడి, జయ జానకి నాయకతో బోయపాటి బాల ప్రదర్శనకు సిద్ధం అయ్యారు.

ఈ మూడు సినిమాలు కూడా ఒక దానికి ఒకటి రసవత్తరమైన పోటీతో బాక్సాఫీస్ భరతం పట్టడానికి ఈ శుక్రవారం వస్తున్నారు. అంతే కాకుండా ఈ మూడు సినిమాలు ఒకటే స్థాయి కలిగినవి కావడం వలన ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చెప్పడం సినిమా విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇది ఇలా ఉంటే..అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం రానా నేనే రాజు నేనే మంత్రి మొదటి స్థానంలో దూసుకుపోతుంది…తర్వాతి స్థానంలో నితిన్ లై , చివరి స్థానంలో బోయపాటి జయ జానకి నాయక నిలవడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news