పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ యేడాది ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రాత్మక సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు. మొఘలాయి సామ్రాజ్యం, ఔరంగజేబు కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అవుట్ కట్స్‌లో వేసిన భారీ సెట్లలో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎం. రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో ఇదే బ్యానర్లో పవన్ ఖుషీ, బంగారం సినిమాలు చేశాడు. ఇక హరిహర వీరమల్లు తర్వాత పవన్ తనకు గబ్బర్‌సింగ్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా రివీల్ చేసేశాడు. సినిమాలో పవన్ ఒక ప్రొఫెసర్ గానే కనిపిస్తారని … ఈ రోల్ చాలా చాలా ఇంట్రస్టింగ్‌గాను, కొత్తగాను ఉంటుందని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే పవన్ ప్రొఫెసర్‌గానే కనిపిస్తాడని.. ఈ పాత్ర అదిరిపోయే రేంజ్లో హరీష్ డిజైన్ చేశాడని తెలుస్తోంది.
ఈ కథ, పవన్ పాత్ర గురించి విన్న కొందరు ఇండస్ట్రీ పెద్దల ద్వారా మ్యాటర్ లీక్ అయ్యింది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక గతంలో సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో చిరంజీవి మాస్టర్‌గా కనిపిస్తారు. అది కూడా తెలుగు మాస్టర్‌గా… మాస్టర్‌గా వచ్చి కాలేజ్ అల్లరి చేస్తూ చదవని విద్యార్థులను ఎలా లైన్లో పెట్టాడు ? వారిని జీవితంలో ఎలా సెటిల్ చేశారు ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఆ మాస్టర్ సినిమాలో చిరు పాత్ర ఎప్పటకీ కొత్తగానే ఉన్నట్టు ఉంటుంది ? నాడు మాస్టర్ పాత్రలో చిరు ఓ సంచలనమే క్రియేట్ చేశాడు ? మరి ఇప్పుడు పవన్ ప్రొఫెసర్‌గా ఏం చేస్తాడో ? చూడాలి.