Moviesబాబాయ్, అబ్బాయి కలిసారు..

బాబాయ్, అబ్బాయి కలిసారు..

సినీ కుటుంబాల్లో ఉన్న వారి మధ్య ఆత్మీయతలు, ఆప్యాయతలు వెల్లివిరుస్తుంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే — వెంకటేశ్ .. సురేశ్ బాబు అన్నదమ్ములుగా ఎంత ఆత్మీయంగా ఉంటారనేది ఇండస్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. ఇక సురేష్ బాబు తనయుడు రానాకీ వెంకటేష్ ఒక బాబాయ్ గా కాకుండా ఒక స్నేహితుడిలా ఉంటాడు. రానా కూడా తను నటించే మూవీస్ లో సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయంలో బాబాయ్ వెంకటేశ్ హెల్ప్ తీసుకుంటాడు.రానా నటించిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ పట్ల విక్టరీ వెంకటేష్ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడని స‌మాచారం.

ఈ సినిమా ఆగ‌స్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్ర‌మంలో సురేశ్ బాబు, రానాతో పాటు వెంకటేశ్ కూడా చిత్రంపై చాలా శ్రద్ధ పెట్టాడ‌ట. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర వెంకటేశ్ స్వయంగా కూర్చున్నాడట. ఎక్కడ ఎలాంటి ల్యాగ్స్ లేకుండా .. చాలా షార్ప్ గా కథనం నడిచేలా జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. ఎడిటింగ్ పై అవగాహన .. మంచి పట్టు ఉండటం వల్ల వెంకటేశ్ పై రానా పూర్తి భరోసాతో ఉన్నాడని చెబుతున్నారు. త్వరలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news