బాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా – యంగ్ హీరో అర్జున్ కపూర్ జంట గత మూడేళ్లుగా పిచ్చగా డేటింగ్లో మునిగి తేలేతున్నారు. 2019లో వీరిద్దరు తమ అధికార బంధాన్ని ప్రకటించారు. తరచూ వీరిద్దరు సహజీవనం చేస్తోన్న ఫొటోలు, వీడియోలు, వర్కవుట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. తనకంటే వయస్సులో 12 ఏళ్లు చిన్నోడు అయిన అర్జున్‌తో తన సహజీవనం, ప్రేమ వ్యక్తపరిచే విషయంలో మలైకా ఏ మాత్రం వెనక్కు తగ్గదు.. ఆమె ఓపెన్‌గానే బీచ్‌లో బికీనీలు వేసుకుని చేసే హంగామా విషయంలోనూ పెద్దగా సిగ్గుపడదు.
ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ యేడాది కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మరోసారి ఈ జంట పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. ఈ యేడాది నవంబర్ లేదా డిసెంబర్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. మలైకాతో తన పెళ్లిపై అర్జున్ కపూర్ కూడా స్పందించాడు. తన ఇన్‌స్టా గ్రామ్‌లో అర్జున్ కపూర్ ప్రతి ఒక్కరు నా జీవితం గురించి నా కంటే ఎక్కువుగా ఎలా తెలుసుకుంటున్నారో ? ఇకపై కూడా అలాగే ప్రేమించండి.. అని కామెంట్ పెట్టాడు.
పెళ్లి సంగతి ఎలా ఉన్నా తాము ఎప్పుడూ గాఢంగా ప్రేమించుకుంటూనే ఉంటామని చెప్పాడు. ఇక మలైకా కూడా తన ప్రియుడు.. తన ప్రేమ గురించి చాలా గొప్పగా అభివర్ణించుకుంది. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా తమ భవిష్యత్తు గురించి చర్చిస్తున్నామని… ఎవరూ కూడా ఒకరిని విడిచి మరొకరం ఉండలేని పరిస్థితికి వచ్చేశామని.. అందుకూ తరచూ ఒకే దగ్గరే ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పింది.
ఆమె చెప్పిన మాటలు చూస్తే వారిద్దరు ఒకరు లేకుండా మరొకరు ఏ మాత్రం ఉండలేని పరిస్థితికి వచ్చేశారని అర్థమవుతోంది. ఎంత సీరియస్‌గా వారు ప్రేమలో మునిగి తేలుతున్నారో ఆమె చెప్పిన మాటలే నిదర్శనంగా ఉన్నాయి. వారిద్దరు పరిణితి చెందిన దశలో ఉన్నప్పటకీ వారు జీవితాన్ని ఇంకా ఎంజాయ్ చేసేందుకు చాలా స్కోప్ ఉందని భావిస్తున్నట్టుగా ఉంది.