ప్రస్తుతం సినిమాలకు డిజిటల్ మార్కెట్ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు రెమ్యునరేషన్లు విపరీతంగా పెంచేస్తున్నారు. దీనికి తోడు రీమేక్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ .. ఓటీటీలు, శాటిలైట్ల రూపంలో నిర్మాతలకు అదనంగా అమౌంట్ వస్తోంది. ఇవన్నీ చూస్తోన్న హీరోలు, దర్శకులు తమ రెమ్యునరేషన్లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు. ఇక దర్శకులు కూడా బాగా తెలివి మీరిపోయారు. ఒకటి రెండు హిట్లు పడితే చాలు రెమ్యునరేషన్లు పెంచేయడం లేదా లాభాల్లో వాటా కావాలని డిమాండ్లు చేయడం చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే పుష్ప సినిమా తర్వాత బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్ వచ్చేసింది. ఇప్పుడు తన ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవల్లో తీసుకు వెళ్లే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అందుకే పుష్ప 2 సినిమాను హడావిడిగా కాకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలోనూ రాజీ పడడం లేదు. పుష్ప 2 తర్వాత వెంటనే పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్లో పెట్టుకోవాలని ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా అనుకున్నాడట.
సదరు కుర్ర డైరెక్టర్ కోలీవుడ్‌లో వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్నాడు. గత కొంత కాలంగా ఒక్క హిట్టూ లేని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్‌తోనే బన్నీ హీరోగా పాన్ ఇండియా సినిమా అనుకున్నారట. తన పాన్ ఇండియా స్టార్ డమ్‌ను నార్త్‌తో పాటు ఇటు తమిళంలో కూడా బాగా తీసుకు వెళతాడని బన్నీ భావించి అతడితో సినిమా చేయాలని అనుకున్నాడట. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేస్తుందనే అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అతడు ఏకంగా తనకు రు. 35 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని కండీషన్ పెట్టాడట. దీంతో నిర్మాతలు అంత రెమ్యునరేషన్ తాము ఇవ్వలేమని ఈ ప్రాజెక్టును వదులుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు తెరకెక్కించిన ఓ మూవీ రు. 200 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం వరుస ప్లాపులతో డీలా పడ్డ బాలీవుడ్ హీరోకే దారి చూపించే పనిలో ఉన్నాడు.
పైగా బన్నీతో సినిమా చేయాలనుకున్న బ్యానర్ కూడా పెద్దదే. వాళ్లు హీరోలకు భారీ రెమ్యునరేషన్లు ఇస్తూ ఉంటారు. అందుకే ఆ డైరెక్టర్ కూడా తన రెమ్యునరేషన్‌తో వాళ్లుకు చుక్కలు చూపించడంతో వాళ్లు సైడ్ అయిపోయారని టాక్ ?