సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న రేంజ్, క్రేజ్ రెండూ కూడా ఎక్కువే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..ఎవ్వరి హెల్ప్ లేకుండా..సినీ ఇండస్ట్రీ లాంటి మహా సముద్రంలోకి వచ్చి..నిలబడటం అంటే మామూలు విషయం కాదు దానికి ఎంతో కష్టం..కృషి, పట్టుదల..శ్రమ అన్ని ఉండాలి. అంతో ఇంతో లక్ కూడా ఉండాలి. అలా తాను కష్ట పడి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ..ఇప్పుడు ఈ పోజీషన్ లో ఉన్నాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయనను ఆదర్శం గా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మందే వచ్చారు. ఇక ఆయన పేరు చెప్పుకుని..హెల్ప్ తీసుకుని మెగా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీ పైనే బ్రతుకుతుంది.
అయితే, వాళ్లలో అందరు సక్సెస్ కాలేదు కానీ.. కొందరు బాగా సెటిల్ అయ్యారు. అయితే, గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో సరైన హిట్ పడటం లేదు. మనం చూసుకున్నట్లైతే పుష్ప తో అల్లు అర్జున్, RRR తో చరణ్..వీళ్లు తప్పిస్తే మెగా హీరోల సినిమాలు హిట్ అవ్వడం లేదు. పవన్ నటించిన భీంలా నాయక్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న..భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పాలేం. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఆచార్య గురించి అయితే చెప్పనవసరం లేదు. ఒకప్పుడు మెగా హీరో సినిమాలు అంటే ఇండస్ట్రీ చరిత్ర తిరగ రాసేది అని ఓ మార్క్ ఉండేది . కానీ, ఇప్పుడు రాను రాను ఆ ట్యాగ్ పోతుంది.
అస్సలు మెగా ఫ్యామిలీ హీరోలు ఇలా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు సినిమా అంటే కధని చూసే వాళ్ళు అని..తమ పాత్ర గురించిన ప్రాధాన్యం చూసేవారు అని ..కానీ ఇప్పుడు కేవలం కమర్షియల్ గా ఆలోచిస్తూ..ముందుకెళ్తున్నారని ..అందుకే సినిమాలో దొబ్బేస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో మెగా హీరోలు కొత్త కధలను చూస్ చేసుకోకుండా కేవలం అందరు రీమేక్స్ సినిమాల పై దృష్టి పెట్టడం కూడా..ఓ మైనస్ పాయింట్ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి చూడాలి నెక్ట్ సినిమాలు అయినా.. కధ విషయంలో క్లారిటీ గా ఉంటారో లేదో ఈ మెగా హీరోలు..?