సూపర్‌స్టార్ మహేష్‌బాబు సర్కారు వారి పాట రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో నాలుగో రోజు వసూళ్లను కలుపుకుని 2 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసింది. ఈ క్రమంలోనే నాలుగు రోజులకే ఈ సినిమా ఎన్నో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. నాలుగు రోజులకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 95.08 కోట్ల షేర్ రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఓ ప్రాంతీయ సినిమాకు ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి.
సోమవారంతో ఈ సినిమా సులువుగానే రు. 100 కోట్ల షేర్ క్రాస్ చేయనుంది. 95 కోట్ల షేర్‌తో ఈ సినిమా చాలా తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్.. సౌత్ స్టార్ హీరోల సినిమాల వసూళ్లను సైతం క్రాస్ చేసి పడేసింది. అసలు కేజీయఫ్ 2, పుష్ప సినిమాలకు లాంగ్ రన్‌లో వచ్చిన వసూళ్లను సర్కారు కేవలం 4 రోజుల్లో ఉఫ్‌మని ఊదేసింది. మరో రికార్డు ఏంటంటే ఓవర్సీస్‌లో 1.5M సినిమాలు 8 ఉన్న ఏకైక హీరోగా మహేష్ నిలిచాడు.
అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 1 కోటి వసూలు చేసిన మహేష్ 10వ సినిమాగా ఇది నిలిచింది. ఒక్క ఈ సెంటర్లోనే కోటి కొల్లగొట్టిన సినిమాలు మహేష్‌కు మాత్రమే 10 ఉన్నాయి. ఇక మహేష్ కెరీర్‌లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన నాలుగో సినిమా ఇది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు.. రజనీకాంత్ ద్విభాషా సినిమాలతో ఈ రికార్డు సాధిస్తే.. మహేష్ కేవలం రీజన్ .. అది తెలుగు భాషతో వచ్చిన ఒక్క సినిమాతో ఆ రికార్డులకు చెక్ పెట్టేశాడు.
వరల్డ్ వైడ్‌గా SVP 4 రోజుల షేర్ల వివరాలు:
నైజాం – 29.61 కోట్లు
సీడెడ్ – 9.81
ఉత్తరాంధ్ర – 9.36
గుంటూరు – 7.57
ఈస్ట్ – 6.51
కృష్ణ – 5.4
వెస్ట్ – 4.41 కోట్లు
నెల్లూరు – 2.91 కోట్లు
—————————
AP/TG) – 75.58 కోట్లు
—————————
కర్ణాటక+ROI – 7.6 కోట్లు
ఓవర్సీస్ – 11.9 కోట్లు
———————————–
వరల్డ్ వైడ్ షేర్ – 95.08 కోట్లు
————————————-