కొరటాల శివ…వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ఊపుమీదున్న ఈ టాలీవుడ్ రైటర్ కం డైరెక్టర్….రైటర్ గా సరి అయిన గౌరవం దక్కడం లేదు అని డైరెక్షన్ డిపార్టుమెంట్లోకి వచ్చి సంచలనాలకు నెలవుగా మారాడు.ఇప్పటి వరకు డైరెక్టర్ గా తీసింది మూడు సినిమాలే అయినా తాను తీసే ప్రతీ సినిమా ద్వారా ఒక మెస్సేజ్ ని ఇవ్వటం కొరటాల స్పెషల్. తాజాగా మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేస్తున్న ఈ డైనమిక్ డైరెక్టర్ రాజకీయాల గురించి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటి వరకు సినిమా దర్శక ప్రముఖులు ఎవరు అయినా రాజకీయాల గురించి మాట్లాడారు అంటే అది ఒక్క దివంగత దాసరి నారాయణరావు మాత్రమే.
అసలు రాజకీయాలు అంటేనే మురికి…ఇక రాను రాను ఇంకా మురికి మయంగా మారిపోతున్నాయి అని మునుపెన్నడూ లేనంతగా రాజకీయాలయు దిగజారిపోతున్నాయి అని..ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా కాపాడలేని విధంగా తయారు అవుతున్నాయి అని…మన అంతట మనమే ఈ కంపును పారదోలితే తప్ప ఈ కుళ్ళు రాజకీయాలు దారిన పడవు అని వివరణ ఇస్తూ వ్యాఖ్యలు చేశారు.
అసలే ఎప్పుడు ఎవరు ఎలా దొరుకుతారా అని ఎదురుచూసే నెటిజన్లకు కొరటాల వ్యాఖ్యలు ఒక రకంగా శక్తిని నింపాయి అని అనుకోవచ్చు. కొరటాల చేసిన ఈ కామెంట్లకు కొరటాల మద్దతు దారులు తమ మద్దతును తెలియజేస్తూ…సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కొరటాల శివ ‘భరత్ అనే నేను’ అనే సినిమా చేస్తున్న తరుణంలో… కొరటాల ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం చూస్తే ఈ మూవీలో రాజకీయ అంశాలు ఉంటాయి అని…అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమి అయినా కొరటాల రాజకీయాల గురించి మాట్లాడ్డం కొంత చర్చకు దారితీసిందనే చెప్పవచ్చు.ఈ వ్యాఖ్యల ద్వారా కొరటాల ఏమి చెప్పదల్చుకున్నాడో త్వరలోనే తెలుస్తుంది…అప్పటి వరకు వేచి చూద్దాం.