ప్రస్తుతం సమాజంలో మనుషుల జీవన శైలీ మారుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటి యువతకు పెళ్లి అయిన కొద్ది రోజులకే శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. పెళ్లికి ముందు యూత్‌కు శృంగారం పట్ల సహజంగానే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే అది పెళ్లయ్యాక చాలా స్పీడ్‌గా తగ్గిపోతూ వస్తోందని చాలా సర్వేలు చెపుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత భర్తల కంటే భార్యలు శృంగారంపై ఆసక్తి కోల్పోతున్నారని తాజా సర్వే చెపుతోంది. ఈ సర్వే స్వయంగా ప్రభుత్వ ఆరోగ్య శాఖ చేసిందే కావడం మరో విశేషం.
దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు మహిళులు తమకు శృంగారం పట్ల ఆసక్తిలేనప్పుడు శృంగారానికి వెంటనే నో చెప్పేస్తామని చెప్పారట. లక్షద్వీప్‌లో అత్యధికంగా 94.2 శాతం మంది – గోవాలో 92 శాతం మహిళలు తమకు శృంగారంపై ఆసక్తి లేకపోతే ధైర్యంగా నో చెపుతామని చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 79.3 శాతం, తెలంగాణలో 84. 9 శాతం – అరుణాచల్ ప్రదేశ్‌లో 63 %, జమ్మూ కశ్మీర్లో 65 శాతం మంది భర్తలకు నో చెపుతారని తేలింది.
జూన్ 17, 2019 నుంచి జనవరి 30, 2020 వరకు 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే చేశారు. అలాగే జనవరి 2, 2020 నుంచి ఏప్రిల్ 30 వరకు రెండో దశ సర్వే చేశారు. భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం చేయడాన్ని వైవాహిక అత్యాచారంగా భావిస్తారు. అయితే ఇది భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం కిందకు రాదు. 18 ఏళ్లు పైబడిన భార్యను భర్త ఒత్తిడి చేసి శృంగారం చేసినా అది నేరం కాదు.
భార్య లైంగీకంగా కలిసేందుకు ఒప్పుకోకపోతే మీ ప్రవర్తన ఎలా ? ఉంటుంది.. కోపం తెచ్చుకుని మందలిస్తారా ? లేదా డబ్బు ఆశ చూపి ఆమెను కంట్రల్లోకి తెచ్చుకుంటారా ? లేదా ఆమెపై కోపంతో మరో స్త్రీతో శృంగారం చేస్తారా ? అన్న ప్రశ్నలకు కేవలం 6 శాతం మంది మాత్రమే ఆ పనులు చేస్తామని చెప్పారు. 72 శాతం మంది భర్తలు మాత్రం తాము ఆ నాలుగు పనులతో ఏకీభవించలేదు.
ఒకవేళ భార్య ఏదైనా కోపం తెచ్చుకుని భర్తతో శృంగారం చేసేందుకు ఒప్పుకోకపోతే ఆమెను మందలించే హక్కు ఉందని 19 శాతం మంది భర్తలు చెప్పారు.