తాజాగా టాలీవుడ్‌లో వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భీమ్లానాయక్ – ఖిలాడీ – రాధేశ్యామ్ – త్రిబుల్ ఆర్ – కేజీయఫ్ 2 – ఆచార్య.. తాజాగా సర్కారు వారి పాట సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన రాధేశ్యామ్ – ఆచార్య సినిమాలు రెండూ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు కాస్త అటూ ఇటూగా రు. 100 కోట్ల నష్టాన్ని చూశాయి.
ఇక తాజాగా రిలీజ్ అయిన మహేష్‌బాబు సర్కారు వారి పాట సినిమా మత్రం మిక్స్ డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రు. 75 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ వరకే ఈ సినిమాకు రు. 50 కోట్ల వసూళ్లు వచ్చాయి. సర్కారు వారి పాట మాత్రం రాధేశ్యామ్, ఆచార్యలా కాకుండా టాక్‌ను దాటేసి వసూల్లు సాధిస్తోంది.
అయితే పై మూడు సినిమాల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ మూడు సినిమాలకు హీరో కుటుంబ సభ్యులే నిర్మాతలు. ఇది కాకతాళీయమే అనుకోవాలి. రాధేశ్యామ్‌కు యూవీ వాళ్లతో పాటు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణా మూవీస్ కూడా సహనిర్మాణ సంస్థగా వ్యవహరించింది. కృష్ణంరాజు కుమార్తె ఈ సినిమా వ్యవహారాలు పర్యవేక్షించారు. భారీ అంచనాలతో పామిస్ట్రీ నేపథ్యంలో వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్‌చరణ్ కలిసి తొలిసారిగా నటించిన ఆచార్య పై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థతో పాటు కొణిదెల ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో కూడా రామ్‌చరణ్‌కు సహ భాగస్వామ్యం ఉంది.
ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమాను మైత్రీ వాళ్లతో పాటు 14 రీల్స్, మహేష్‌బాబు సొంత బ్యానర్ అయిన జీఎంబీ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో మహేష్‌కు భాగస్వామ్యం ఉంది. మరి రాధేశ్యామ్, ఆచార్య ప్లాప్ అవ్వగా… సర్కారు వారి పాట ఏం చేస్తుందో ? చూడాలి.