దర్శకుడు బోయపాటికి బాలయ్య, నందమూరి, టీడీపీ అభిమానులకు మాంచి బాండింగ్ ఉంది. బాలయ్యతో ఉన్న అనుబంధం నేపథ్యంలో బోయపాటి టీడీపీ ప్రచారానికి కూడా అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఈ తరం జనరేషన్ హీరోలకు బాలయ్యను కనెక్ట్ చేయడంతో పాటు ఈ వయస్సులో బాలయ్యకు మూడు తిరుగులేని హిట్లు ఇచ్చిన ఘనత బోయపాటికే దక్కుతుంది.
బి. గోపాల్ తర్వాత గత దశాబ్దకాలంలో బాలయ్యకు వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్లలో సింహా – లెజెండ్ – అఖండ మూడు ఉన్నాయి. ఈ మూడు సూపర్ హిట్లే. అందుకే బాలయ్య, బోయపాటిది సూపర్ హ్యాట్రిక్ కాంబినేషన్ అయ్యింది. 2014 ఎన్నికల టైంలో వచ్చిన లెజెండ్ సినిమా బాలయ్య పొలిటికల్ ఎంట్రీకి ఊపు ఇవ్వడంతో పాటు ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కార్యకర్తల్లో మాంచి జోష్ తేవడానికి కీలకంగా నిలిచింది.
ఇక మళ్లీ ఇప్పుడు బాలయ్య వరుస ప్లాపుల్లో ఉండడం.. ఇటు కరోనా దెబ్బతో ఇండస్ట్రీ అయోమయంలో ఉన్నా కూడా వచ్చిన అఖండ టాలీవుడ్లో పెద్ద హీరోలకు ఓ దిక్సూచిలా మారింది. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య – బోయపాటి ఫక్తు పొలిటికల్ స్క్రీఫ్ట్ రెడీ అవుతోందట. బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీతో చేస్తోన్న సినిమా తర్వాత వెంటనే అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.. అది పూర్తయిన వెంటనే బాలయ్య – బోయపాటి సినిమా తెరకెక్కనుంది.
పొలిటికల్ సెటైర్లు, పంచ్‌లతో ఈ సినిమా కథ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య నోట లెజెండ్‌లో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగులు పేలాయో ఈ సినిమాలోనూ అంతే పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయని తెలుస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే లెజెండ్ రేంజ్లో అంటే లెజెండ్ 2 అనుకోవచ్చని అంటున్నారు. బోయపాటికి కథలో పొలిటికల్ లైన్‌ను ఎలా కలపాలో బాగా తెలుసు.
అందులోనూ పొలిటికల్ డైలాగులు, బాలయ్య స్టైల్ మాస్ పంచ్‌లు అంటే అదిరిపోవాలి. ఈ సినిమాను వచ్చే మార్చి నుంచి పట్టాలెక్కిస్తారని.. ఏపీలో ఎన్నికల మూమెంట్‌ను బట్టి కాస్త ముందుగానే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారని టాక్ ?