క్రేజ్ కోసం గ్లామర్ డోస్ పెంచడం హీరోయిన్లకు అలవాటే. అయితే అందాలు ఆరబోసినప్పటికీ కొంతమంది ముద్దుగుమ్మలకు కాలం కలిసి రాదు. సరైన అవకాశాలు రావు. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల తార సురభి ఆతర్వాత తెలుగులో ‘బీరువా’ సినిమా చేసింది. అనంతరం జెంటిల్మన్, ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. అయితే స్టార్ హీరోల సరసన నటించాలని తహతహలాడుతోంది సురభి. అందుకోసం గ్లామర్ డోస్ పెంచాలని నిర్ణయించుకుందట.
ప్రస్తుతం సురభి చేతిలో ఒకే సినిమా ఉంది. ఈ సినిమాలో మెగా హీరో అల్లు శిరీష్ సరసన ఆమె హీరోయిన్గా చేస్తోంది. మెగా ఫ్యాన్స్‌ను తనవైపు తిప్పుకోవడానికి ఈ భామ సినిమాలో హద్దులు దాటి అందాలొలికించిందని తెలిసింది. సురభి గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అయిపోవడం ఖాయమని అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ఓ వినూత్నమైన టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.