యశ్ ఒకే ఒక్క సినిమా దెబ్బతో ఇండియా వైజ్‌గా రాకింగ్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా రాకీభాయ్ అయిపోయాడు. ఈ సినిమాకు ముందు వరకు యశ్ సొంత భాష కన్నడంలో కూడా పెద్దగా ఫాలోయింగ్ లేదు. అలాంటి యశ్ కేజీయఫ్ దెబ్బతో తిరుగులేని పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడా చాలా చోట్ల యశ్ సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు పల్లెటూర్లలో యశ్ అభిమానులు, యశ్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు.
ఒక్క సినిమా యశ్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులకు కనెక్ట్ చేసింది. కేజీయఫ్ 2 ఇప్పుడు ఏకంగా ఇండియాలో త్రిబుల్ ఆర్ రికార్డులకు చెక్ పెట్టేసింది. మరో రు. 20 కోట్లు వసూలు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా త్రిబుల్ ఆర్ రికార్డులను కేజీయఫ్ బీట్ చేసేస్తుంది. ఈ ఒక్క సినిమా దెబ్బతో యశ్ రెమ్యునరేషన్ ఏకంగా రు. 50 కోట్లకు పైనే ఉంది.
కేజీయఫ్ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు యశ్ నటించిన పాత సినిమాల రైట్స్ కొని వాటిని అన్ని ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేసే కార్యక్రమం మొదలైపోయింది. మన తెలుగు సినిమా నిర్మాతలు కూడా యశ్ పాత సినిమాల రైట్స్ తీసుకుని తెలుగులోకి డబ్ చేయడం స్టార్ట్ చేసేశారు. ఈ క్రమంలోనే యశ్ తన భార్య రాధికా పండిట్‌తో కలిసి నటించిన సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాకు రారాజు అన్న టైటిల్ ఖరారు చేశారు. మహేష్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంతు స్ట్రెయిట్ ఫార్వార్డ్ పేరుతో ఈ సినిమా వచ్చింది. దీనిని ఇప్పుడు ఇక్కడ రారాజుగా అనువదిస్తున్నారు. పద్మావతి పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. కన్నడలో ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. మరి తెలుగులో రారాజు ఏం చేస్తాడో ? చూడాలి.