నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ హైదరాబాద్ నాచారం పరిసర ప్రాంతాల్లో శరవేగంగా నడుస్తోంది. క్రాక్ తర్వాత మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో పాటు అఖండ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా మైత్రీ మూవీస్ వాళ్లు చాలా ప్రెస్టేజ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చాలా ఇంట్రస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమా మాస్ నేపథ్యంలోనే ఉంటుందని.. బాలయ్య అభిమానులకు మాంచి విజువల్ ఫీస్ట్ అని తెలుస్తోంది. భారీ కాస్టింగ్ కూడా ఉండడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా మైత్రీ వాళ్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కన్నడంలో బాలయ్యకు ఎలాగూ మాంచి ఇమేజే ఉంది.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఉండడంతో కోలీవుడ్‌లోనూ ఈ ప్రాజెక్టుకు మాంచి బజే ఉంటుంది. పైగా కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా చేస్తుండడంతో కన్నడ నాట కూడా బాలయ్య గత సినిమాలతో పోలిస్తే ఎక్కువ క్రేజే కనిపిస్తోంది. శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండడం కూడా అన్ని భాషల్లో సినిమాపై హైప్‌కు కారణం కానుంది.
ఇక ఈ సినిమాకు వీర సింహారెడ్డి, అన్న గారు అన్న రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అఖండ సినిమాకు కూడా రకరకాల టైటిల్స్ ప్రచారం జరిగాయి. అయితే చివరకు బోయపాటి సర్ప్రైజింగ్గా అఖండ టైటిల్ ఖరారు చేశారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విషయంలో ఎవరెన్ని టైటిల్ సూచిస్తున్నా బాలయ్య మాత్రం వీర సింహారెడ్డి టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్ రివీల్ కూడా చేసేందుకు ప్లాన్ జరుగుతోంది. కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. సినిమాకు అయితే పాజిటివ్ బజ్ మామూలుగా లేదు. మరి బాలయ్య ఏం చేస్తాడో ? చూడాలి.