సాధారణంగా ఒక సినిమా సక్సెస్ సాధిస్తే ఏ హీరో అయినా రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తాడు. తాజాగాకేజీయఫ్ 2 సినిమా హిట్ అవ్వడంతో హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరూ కూడా తమ రెమ్యునరేషన్లు ఊహించని విధంగా పెంచేశారనే అంటున్నారు. ఒక్కసారిగా వీరిద్దరి రెమ్యునరేషన్లు డబుల్ అవ్వడం కాదు.. త్రిబుల్ అయిపోయాయని అంటున్నారు.
మన తెలుగు హీరోలు ఒక్క హిట్ పడితే చాలు రు. 40 కోట్లు, రు. 50 కోట్లు అని ప్రతి సినిమాకు రు. 10 కోట్ల చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్స్ కాంబినేషన్ సెట్ చేయాలంటేనే జన్యూన్ నిర్మాతలకు కష్టం అయిపోతోంది. రియల్ ఎస్టేట్‌లో నాలుగు డబ్బులు సంపాదించుకుని ఇక్కడ ఓ రాయి వేద్దాం అనుకునే నిర్మాతలు మినహా భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటేనే చాలా మంది సీనియర్ నిర్మాతలు సైతం భయపడాల్సిన పరిస్థితి.
అయితే సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రం ఎప్పుడు నిర్మాతలు, దర్శకులు హీరోగానే ఉంటారు. ఈ విషయంలో బాలయ్యకు సాటి వచ్చే హీరోయే ఎవ్వరూ ఉండరు. ఎంత పెద్ద హిట్ వచ్చినా రెమ్యునరేషన్ అడ్డగోలుగా పెంచేసి నిర్మాతలకు భారం కానివ్వడు బాలయ్య. నిర్మాత అనేవాడు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది.. వాళ్లే పదిమందికి అన్నం పెడతారన్నదే బాలయ్య భావన.
బాలయ్య తండ్రి సీనియర్ ఎన్టీఆర్ సైతం ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యేవారు. తాజాగా అఖండ సినిమాతో బాలయ్య అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. అఖండకు బాలయ్యకు నిర్మాతలు రు. 11 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈ సినిమా ఓవరాల్ వసూళ్లు రు. 200 కోట్లకు చేరుకున్నాయి. కావాలనుకుంటే బాలయ్య తన తాజా సినిమా అయిన మలినేని గోపీ సినిమా రెమ్యునరేషన్ రు. 15 కోట్లకు పైనే తీసుకోవచ్చు.
కానీ అఖండతో పోలిస్తే ఒక్క కోటి మాత్రమే పెంచి రు. 12 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. అది కూడా నిర్మాతలే ఆ కోటి పెంచి ఇస్తున్నట్టు టాక్ ? ఇప్పుడు టైర్ టు రేంజ్ హీరోలే ఒక్కో సినిమాకు రు. 12 – 15 కోట్లు చార్జ్ చేస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం నిర్మాతలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తన సినిమా ఎప్పుడూ సేఫ్ జోన్‌లో ఉండేలా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ హీరో అయినా ఇలా ఆలోచిస్తే టాలీవుడ్‌పది కాలాల పాటు చల్లగా ఉంటుంది.