మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాగా మొదలైన ఆచార్య మరో రెండు థియేటర్లలోకి రానుంది. చిరంజీవితో పాటు రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో పాటు పూజా హెగ్డే హీరోయిన్ కావడం.. కొరటాల శివ డైరెక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అందుకే ఆచార్యకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రు. 133 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. యూఎస్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో 2.5 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
అన్నీ బాగానే ఉన్నా ఆచార్య విషయంలో ముందు నుంచి ఏదో గందరగోళం.. ఏదో కన్‌ఫ్యూజ్ ఉందని తెలుస్తోంది. ఏదైనా భారీ సినిమా.. అందులోనూ కొరటాల శివ సినిమా అంటే స్క్రిఫ్ట్‌తో పాటు అందులో ఎవరెవరు నటిస్తారు ? అన్నది ముందే లాక్ అయ్యి ఉంటుంది. కొరటాల స్క్రిఫ్ట్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుందో చెప్పక్కర్లేదు.
అయితే ఆచార్య విషయంలో కొరటాల సైతం ముందు నుంచి గందరగోళంలోనే ఉన్నట్టే కనిపిస్తోంది. స్క్రిఫ్ట్ పూర్తవ్వకముందు చెర్రీ క్యారెక్టర్‌లో మహేష్‌బాబు పేరు బయటకు వచ్చింది. తర్వాత చరన్ వచ్చాడు. ఇక హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చాలా పేర్లు బయటకు వచ్చాయి. కాజల్ పేరు అనౌన్స్ అయ్యింది. కాజల్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. తీరా సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు కాజల్ క్యారేక్టరే లేదంటున్నారు.
ఇక అసలు కథలో ముందు చెర్రీ క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్ లేదన్నారు. చరణ్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాక ఆ సిద్ధా క్యారెక్టర్ నిడివిని బాగా పెంచేశారట. ఈ విషయాన్ని కొరటాలే స్వయంగా చెప్పారు. అసలు చరణ్ రోల్‌ను ముందుగా గెస్ట్ అప్పీరియన్స్‌తో మొదలు పెట్టారట. చివరకు చరణ్ సిద్ధా పాత్రను పెంచాలని అనుకున్నప్పుడు కథలో చాలా మార్పులు, చేర్పులు జరిగాయంటున్నారు.
మరి ఈ మార్పులు చేర్పులు సినిమాకు ఎంత వరకు ప్లస్ అయ్యాయి అన్నది రేపు ఆచార్య చూస్తే కాని తెలియదు. అసలు చరణ్ పాత్ర కోసం కథనే మార్చడం ఒక ఎత్తు అయితే.. చిరు పక్కన కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకుని కొంత కాలం షూటింగ్ చేశాక.. ఇప్పుడు ఆ పాత్రనే తీసేయడం మరో ట్విస్ట్. అయితే ఇవన్నీ పేపర్ మీద కథ ఉన్నప్పుడు జరిగి ఉంటే పెద్ద ఆశ్చర్యం ఉండదు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఇన్ని మార్పులు జరగడంతో కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. మరి ఈ అనుమానాలకు కొరటాల ఆన్సర్ ఎలా ? ఉంటుందో సినిమా రిజల్టే చెపుతుంది.