అసలు టాలీవుడ్‌లో సంక్రాంతికి మినహా ఆ తర్వాత ఏ సీజన్లో అయినా ఓ పెద్ద హీరో సినిమా వస్తుందంటే దానికి పోటీ వెళ్లే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. సంక్రాంతికి అయితే తప్పదు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాకు ఎవ్వరూ పోటీగా వెళ్లడం లేదు. ఈ నెల 29న ఆచార్య సినిమా వస్తోంది. దిల్ రాజు ఎఫ్ 3 సినిమాను కూడా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఆచార్యకు పోటీగా ఎందుకని మే నెలకు వాయిదా వేశారు.
ఇక మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఎంత పెద్ద హీరోలకు అయినా పోటీకి వెళ్లడం బెరుకే. అయితే ఆచార్యకు పోటీగా రెండు చిన్న సినిమాలు వస్తున్నాయి. అవతల వైపు మెగాస్టార్‌తో పాటు రామ్‌చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా అయినా మాత్రం ఆ చిన్న సినిమాల వాళ్లు తాము ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఆచార్య వస్తుంది.. బాక్సాఫీస్ మీద తన పంజా విసురుతుందని తెలిసి కూడా ఆ రెండు సినిమాలు వస్తున్నాయంటే ఆశ్చర్యమే.
ఆచార్య సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే కేఆర్కే అనే కోలీవుడ్ డబ్బింగ్ మూవీ వస్తోంది. విజయ్ సేతుపతి హీరో. అంతకన్నా విశేషం ఏంటంటే ఇద్దరు క్రేజీ హీరోయిన్లు నయనతార, సమంత హీరోయిన్లు. నయన్ లవర్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు అని నయన్ అంటే.. నాతో పడుకున్నాడు అని సమంత చెప్పడంతోనే ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆచార్య ఉన్నా కేఆర్కే ఎక్కడా వెనక్కు తగ్గకుండానే థియేటర్లలోకి వచ్చేస్తుంది.
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు తెలుగులోనూ ఓ సెక్షన్ ఆడియెన్స్‌లో అయితే చూడాలన్న ఆతృత ఉంది. నయనతార, సమంత ఉన్నారు.. ఖచ్చితంగా చూసేవాళ్లు ఉంటారు. ఆచార్య రిలీజ్ అయిన మరుసటి రోజు వారాహి బ్యానర్‌పై శ్రీ విష్ణు నటించిన భళా తందనాన వస్తోంది. పైగా అప్పటకి కేజీయఫ్ 2, త్రిబుల్ ఆర్ కొన్ని థియేటర్లలో ఉంటాయి.
ఆచార్య ఎక్కువ థియేటర్లలో వేస్తారు. మరి ఏ ధైర్యంతో కేఆర్కే, భళా తందనాన వస్తున్నాయన్నది వాళ్లకే తెలియాలి. అయితే ఏ సెంటర్లతో పాటు మల్టీఫ్లెక్స్‌ల్లో స్క్రీన్లు మాకు వస్తాయన్న ధీమా వాళ్లకు ఉంది. రంజాన్ ఉండడంతో అది కూడా తమ సినిమాలకు కలిసి వస్తుందని వారు చెపుతున్నారు. వీళ్ల ధీమా ఎలా ? ఉన్నా ఆగస్టు చివర వరకు పెద్ద సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి. దీంతో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి కూడా ఉంది.