సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేయడం మామూలే. స్టార్ హీరోల కుమారులు వారి తండ్రుల నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. తెలుగు సినిమా రంగానికి రెండు కళ్లు అయిన నందమూరి, అక్కినేని ఫ్యామిలీల నుంచి మూడో తరం హీరోలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి రెండో తరంలో బాలయ్య స్టార్ హీరోగా ఉంటే.. ఇప్పుడు మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వర్ హీరో రేసులో దూసుకు పోతున్నాడు.
ఇక అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్ నట వారసత్వాన్ని నాగార్జున కంటిన్యూ చేస్తే.. ఇప్పుడు ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా మూడో తరం హీరోలుగా సక్సెస్ ఫుల్‌గా ముందుకు వెళుతున్నారు. ఇటు కొణిదెల కాంపౌండ్ నుంచి రెండో తరంలో పదుల సంఖ్యలో హీరోలు రెడీ అయిపోయారు. హీరోల వారసులు ఎంట్రీ ఎలా ? ఉన్నా.. నట వారసురాళ్లు సినిమాల్లోకి రావడం ముందు నుంచి తక్కువగానే నడుస్తోంది. హీరోల కుమార్తెలు ఇండస్ట్రీలో రాణించిన సందర్భాలు కూడా తక్కువే.
ఇక ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికి వస్తే సూపర్‌స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్‌బాబు టాలీవుడ్లోనే తిరుగులేని హీరోగా ఉన్నాడు. అభిమానుల ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా అందరిని మెప్పించడం మహేష్ స్టైల్. ఇక కృష్ణ నట వారసురాలిగా ఆయన కుమార్తె మంజుల కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. షో లాంటి సినిమాలో నటించిన మంజుల… నిర్మాతగా మారి ఏ మాయ చేశావే లాంటి హిట్ సినిమాలు కూడా తీశారు.
అయితే బాలకృష్ణకు జోడీగా మంజుల హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. బాలయ్య – సౌందర్య జంటగా ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో టాప్ హీరో సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా మంజులను అనుకున్నారు. బాలయ్య కూడా తనకు అభ్యంతరం లేదనే అన్నారు. అయితే ఈ వార్త బయటకు రావడంతో కృష్ణ అభిమానులు డైరెక్టుగా కృష్ణ గారి ఇంటికి వెళ్లి మంజుల ఇతర హీరోలతో ఆడి పాడితే మన పరువు ఏం కావాలని కృష్ణతోనే వాగ్వివాదానికి దిగారు.
ఈ రిస్క్ ఎందుకు అనుకున్న కృష్ణ గారు మంజుల ఈ సినిమా చేయదని చెప్పేశారు. అలా బాలయ్యకు జోడీగా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాల్సిన మంజుల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత మంజుల ప్లేస్‌లో సౌందర్యను హీరోయిన్గా తీసుకున్నారు. తెలుగులో తాను హీరోయిన్గా చేస్తే చాలా సమస్యలు వస్తాయని భావించిన మంజుల మళయాళంలో ఓ సినిమాలో హీరోయిన్గా చేసినా అది మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని నీలకంఠ దర్శకత్వంలో షో సినిమా చేసింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. ఏదేమైనా కృష్ణ అభిమానులకు ఇష్టం లేకపోవడంతో బాలయ్య – మంజుల కాంబినేషన్ మిస్ అయ్యింది.