లోకం తీరు మారుతోంది.. ఒకప్పుడు పెళ్లయ్యాక చనిపోయే వరకు కూడా భార్య పరాయి మగవాడిని మరో ఉద్దేశంతో చూడడం కాదు కదా.. కనీసం మనసులో ఊహించుకోవడం కూడా ఎంతో తప్పుగా భావించే వారు. అయితే ఇప్పుడు సమాజం తీరు మారిపోయింది. అక్రమసంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయ్యి.. పిల్లలకు తల్లి అయిన భార్యలు.. భర్తలను వదిలేసి మరో వ్యక్తి మోజులో పడుతున్నారు. ఇటు భర్తలు కూడా భార్య ఉండగానే మరో స్త్రీ కోసం ఆరాటపడుతున్నాడు.
అయితే తాజాగా కొందరు మానసిక నిపుణులు చేసిన అధ్యయనంలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. భర్తలు.. తమను ఎంతో బాగా చూసుకునే భార్య ఉండగానే.. పరాయి స్త్రీ మోజులో, మైకంలో ఎందుకు ? పడుతున్నాడు అంటే అందుకు కొన్ని కారణాలు వారు వెల్లడించారు. భర్తలపై అనుమానాలు వచ్చినప్పుడు భార్యలు ఓ కంట కనిపెట్టడంతో పాటు వారికి అనుమానం రాకుండా నిఘా కూడా పెట్టాలని చెప్పారు.
భర్తలు తరచూ సెల్ ఫోన్లో.. అది కూడా ఫోన్ వచ్చిన వెంటనే పక్కకు వెళ్లి మెల్లగా మాట్లాడడం లాంటివి చేస్తే భార్యలు గమనించాలట. ఇక భర్త ఫోన్ చాలా జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఎవ్వరిని టచ్ చేయనీయకుండా చేసినా కూడా భార్య ఓ కంట గమనించాలట. ఇక ఇంటికి టైంకు రాకుండా.. బయటే తరచూ భోజనాలు చేసి వస్తున్నా కూడా .. దానికి సరైన క్లారిఫికేషన్ తీసుకోవాలట భార్యలు.
కొందరు భర్తలు.. బయట తప్పులు చేస్తూ.. భార్యకు అనుమానం రాకుండా ఉండేందుకు సడెన్‌గా ప్రేమలు ఒలకబోస్తూ ఉంటారట. అలాంటి భర్తలను కూడా అస్సలు నమ్మకూడదని మానసిక నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. ఇక కొందరు భర్తలు వయస్సు పెరిగి.. 50 +లోకి వచ్చాక కూడా మరొకరి మోజులో పడి అందంపై దృష్టి పెడుతూ ఉంటారట.
అలా తరచూ అందంపై దృష్టి పెట్టే భర్తలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండాలట. మరి కొందరు భర్తలు బాగానే సంపాదిస్తూ ఉంటారు. అయితే తరచూ వారి బ్యాంకు బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏదో ఖర్చు చెప్పి తప్పించుకుంటారే కానీ.. సరైన కారణాలు చెప్పరు. భర్త ఆర్థిక విషయాలపై అనుమానాలు వచ్చినప్పుడు కూడా భార్య జాగ్రత్తగా ఉండాలట.
ఇక భర్త పనిచేసే ఆఫీసులు, ఇతర ప్రదేశాల్లో స్త్రీలతో సంబంధాలు పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు అతడికి అనుమానం రాకుండా ఆ ఆఫీసు లేదా ప్రదేశంలో భర్తపై ఓ కన్నేసి ఉంచాలట. ఇక డెలివరీ సమయంలో భార్యలు పుట్టింటికి వెళ్లినప్పుడు కూడా భర్తలపై నిఘా పెట్టాలని ఆ సమయంలోనే భర్తలు ఎక్కువుగా తప్పులు చేసేందుకు అవకాశం ఉంటుందని ఈ అధ్యయనం చెప్పింది.
పైన చెప్పుకున్నట్టు ఏ అనుమానం వచ్చినా భార్యలు మాత్రం వెంటనే అలెర్ట్ అయిపోవాలి. భర్తను అతిగా నమ్మితే అప్పుడు భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడి మిమ్మలను దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో గమనించుకోకపోతే అది భార్యల తప్పే అవుతుంది.