సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం మాత్రమే కాదు ఈ రంగుల ప్రపంచంలో రంగులు మారినట్టు జీవితం కూడా స్పీడ్‌గా మారిపోతూ ఉంటుంది. హీరోలంటే ఏదోలా నెట్టుకు వస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా ఒక్క హిట్ పడితే లైన్లోకి వచ్చేస్తారు. లేకపోతే ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుగానో లేదా విలన్‌గా చేసుకుంటారు. హీరోలు ఇక్కడ మోసపోయేందుకు పెద్దగా స్కోప్ ఉండదు. అదే హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. వాళ్లకు ఛాన్సులు రావాలన్నా.. హీరోయిన్గా ఎదగాలన్నా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడికక్కడ తలవంచాలి.. స్టార్ హీరోయిన్ అయ్యాక ఓకే.. కానీ అంతకు ముందు వారు పడే ఇబ్బందుల్లో కొన్ని చెప్పుకునేవి ఉంటాయి.. మరి కొన్నింటిని చెప్పుకోలేరు.
యంగ్ హీరోయిన్లు కెరీర్లో రాణించాలని చాలా స్పీడ్‌గా డెసిషన్లు తీసేసుకుంటూ ఉంటారు. అలాగే ఆకర్షణలకు కూడా లోనైపోతూ ఉంటారు. 22 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వచ్చింది. సూపర్ హిట్. ఎన్టీఆర్ కెరీర్‌కు ఈ సినిమాతోనే బలమైన పునాది పడింది. పాటలు బ్లాక్‌బస్టర్.. రాజమౌళి మెగా ఫోన్ పట్టింది ఈ సినిమాతోనే..! ఆ తర్వాత గజాలాకు తెలుగు – తమిళ్ – మళయాళంలో పాటు ఎన్నో హిట్ సినిమాలు చేసింది.
అదే టైంలో ఆమె టాలీవుడ్‌కే ఓ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడింది. అయితే అప్పటికే సదరు యంగ్ హీరో మరో స్టార్ హీరోయిన్ను ప్రేమించి.. ఆమెను వాడుకుని మోసం చేశాడు. ఆ హీరో దెబ్బతో ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ కావాల్సిన ఆ హీరోయిన్ కెరీర్ నాశనం అయ్యింది. ఆ హీరోను ప్రేమించిన గజాలా అతడు మోసం చేశాడంటూ చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని అంటారు. అయితే ఆ బాధల్లో ఆమె చాలా వరకు బయటకు చెప్పుకోలేదు.
లోలోన సంఘర్షణ పడి చివరకు ఆమె ఆత్మహత్యకు యత్నించిందని అంటారు. ఆ టైంలో సీనియర్ హీరో అర్జున్ ఆమెను సేవ్ చేశాడని.. ఆమెకు అన్ని విధాలా అండగా ఉన్నాడన్న టాక్ బయటకు వచ్చింది. అర్జున్గో గజాలా కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే అతడితో ఉన్న స్నేహం కారణంగానే గజాలాను పెద్ద డిప్రెషన్ నుంచి అర్జున్ బయట పడేశారని అంటారు. మే 19 , 1985 లో జన్మించిన గజాల తెలుగునాట చాలా సినిమాలే చేసింది.
ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నెంబర్ లాంటి హిట్ సినిమా చేసిన గజాలా ఆ తర్వాత మరోసారి అదే ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు సినిమాలో కూడా జోడీ కట్టింది. ఆ సినిమా యావరేజ్ అయినా గజాలా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఏదేమైనా గజాలా తెలుగులో ఎంత స్పీడ్‌గా ఎదిగిందో అంతే స్పీడ్‌గా కనుమరుగు అయిపోయింది.