ఇప్పుడు దేశం అంతటా కేజీయఫ్ సినిమా గురించి మార్మోగుతోంది. కేజీయఫ్‌తో పాటు యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్ల గురించే చర్చ నడుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ చూశాక దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సలార్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ లైనప్‌లోకి వచ్చేశాడు.
అసలు ఈ నీల్ ఎవరు ? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది. నీల్ కర్నాటకలోని హసన్‌లో పుట్టాడు. సినిమాల మీద ఆసక్తితో ఫారిన్లో డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ వైపు బయలుదేరాడు. 2014లో బావమరిది శ్రీ మురళీ హీరోగా ఉగ్రమ్ సినిమా రూపొందించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యేముందు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
అయితే ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ గురించి తెలుసుకున్న హీరో దర్శన్ ముందుకు రావడంతో ఉగ్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. 2014 ఫిబ్రవరి 21న ఉగ్రమ్ రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ విజయం నీల్‌కు సంతృప్తి ఇవ్వలేదు. తన తర్వాత విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలని అనుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచే నీల్ కేజీయఫ్ గనుల గురించి కథలు కథలుగా వింటున్నాడు.
అప్పటికే కన్నడ ఇండస్ట్రీలో సంచలనాల హీరో యశ్‌ను హీరోగా అనుకున్నారు. అప్పటకీ కన్నడ ఇండస్ట్రీ హయ్యస్ట్ కలెక్షన్ రు. 75 కోట్ల గ్రాస్. అయితే కేజీయఫ్ తీసేందుకు రు. 80 కోట్లు కావాలి. అంత ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు. పైగా నవ్వుకున్నారు. అయితే హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగదూర్కు ఎందుకో నీల్ మీద నమ్మకం కుదిరి.. ఆయన ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
అయితే అప్పటికే బాహుబలి హిట్ కొట్టి రాజమౌళి నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. రాజమౌళిని తమ సినిమా ప్రమోషన్‌కు వాడుకోవాలని చూస్తున్నారు. ఓ రోజు ఎయిర్‌పోర్టులో రాజమౌళి యశ్, నీల్‌కు తారసపడ్డాడు. వెంటనే వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. రాజమౌళి ఏదో హడావిడిలో ఉన్నాడు. యశ్ సార్ మాది కూడా తమది పాన్ ఇండియా సినిమా అని చెపుతున్నా వాళ్లు పట్టించుకోవడం లేదు. నీల్ గురించి యశ్ ఏదో గొప్పగా చెపుతున్నా రాజమౌళి చెవులకు ఎక్కడం లేదు.
అయితే ఓ ఐదారు నిమిషాలు ల్యాప్‌టాప్‌లో విజువల్స్ చూపించారు. చివరకు అది 20 నిమిషాలకు వెళ్లింది. ఆ విజువల్స్ చూస్తుంటే రాజమౌళి మైండ్ పోయింది. అప్పుడే అర్థమైంది కేజీయఫ్ అనేది ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందని… వెంటనే ఆ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు మరో రాజమౌళి అనే రేంజ్‌కు నీల్ వెళ్లిపోయాడు. కేజీయఫ్ రెండు పార్టులు అంత సంచలన విజయం సాధించాయి.
ప్రశాంత్ నీల్ ఆంధ్రప్రదేశ్ వ్యక్తేనా…
ఇక ప్రశాంత్ నీల్ తన తాజా ఇంటర్వ్యూలో తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తే అని చెప్పుకున్నారు. తనకు మా నానమ్మ అంటే ఎంతో ఇష్టం అని.. తనతో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉండేదని.. తాను ఎంత తిట్టినా కూడా తనను బాగా చూసుకునేదని నీల్ చెప్పాడు. తాను తినకపోతే ఆమే దగ్గరుండి తినిపించేదని.. తాను చనిపోయినప్పుడు ఇక్కడ జాగా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని మా సొంత ఊర్లోనే అంత్యక్రియలు జరిపించాం అని చెప్పాడు.
ఏదో ఒక రోజు ఆ సమాధి మొత్తాన్ని తీసుకువచ్చి తన ఇంట్లో వాకిట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాని నానమ్మ అనుబంధం చెప్పాడు. ఇదే ఐడియాను సినిమాలో హీరో తల్లి విషయంలో చూపించానని అన్నాడు. నీల్ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చెప్పడంతో ఇప్పుడు ఆ ఊరు ఎక్కడా ? అన్న చర్చ స్టార్ట్ అయ్యింది. నీల్ తన ఊరేంటో చెప్పకపోయినా ఇది అనంతపురం జిల్లాలో ఉందని అంటున్నారు.