ఇండస్ట్రీ హిట్ అంటే హీరోలకు, వారి అభిమానులకు మామూలు పండగ కాదు. దాని వారు ఎంతో ప్రెస్టేజియస్‌గా తీసుకుంటారు. ఇప్పుడు అంటే ఓ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్నదే ఎంత పెద్ద హిట్ అనేందుకు ప్రామాణికంగా మారింది. అదే రెండు దశాబ్దాల క్రితం వరకు ఓ సినిమా ఎంత పెద్ద హిట్ అని చెప్పేందుకు అది ఎన్ని కేంద్రాల్లో 50 రోజులు ? 100 రోజులు ? 175, 200 రోజులు ఆడిందే అన్నదే ప్రామాణికంగా ఉండేది. అప్పట్లో ఎన్ని కేంద్రాల్లో ఎన్ని రోజులు ఆడింది అన్నదే గొప్పగా ఉండేది.
అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం.. ఎవరైనా తమ హీరో గొప్ప.. తమ హీరో సినిమా హిట్ అంటుంటే మరో హీరో సినిమాలు దానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం కామన్ అయిపోయింది. సరే ఇప్పుడు సినిమాల సంగతి ఎలా ? ఉన్నా గతంలో వచ్చిన స్టార్ హీరోల హిట్ సినిమాల్లో 6 కాంట్రవర్సీ ఇండస్ట్రీ హిట్స్ గురించి తెలుసుకుందాం.
ఖైదీ:
1983లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చిరు ఫ్యాన్స్ అంటారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్. మాధవి – సుమలత హీరోయిన్లుగా నటించారు. చిరును మెగాస్టార్‌ను చేసిందే ఈ సినిమా. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చిరు ఫ్యాన్స్ చెప్పినా అంతకుముందు వచ్చిన నాగేశ్వరరావు ప్రేమాభిషేకం, ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలను ఖైదీ క్రాస్ చేయలేదని కొందరు అంటారు. ఇక అదే యేడాది రిలీజ్ అయిన ముందడుగు కూడా హయ్యస్ట్ క్రాసింగ్ మూవీ అన్న వాదన కూడా ఉంది.
నిన్నే పెళ్లాడతా:
1996లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా నిన్నే పెళ్లాడతా. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్. నాగార్జున దీనికి నిర్మాత. టబు హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఇప్పుడు చూస్తున్నా కూడా ఏదో రొమాంటిక్ యాంగిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాను అప్పటికి ఇండస్ట్రీ హిట్ అని నాగ్ అభిమానులు చెప్పుకునేవారు. అయితే అంతకు ముందే మోహన్‌బాబు పెదరాయుడు సినిమా వసూళ్లను ఈ సినిమా క్రాస్ చేయలేదని కొందరు అంటారు.
కలిసుందాం రా :
2000 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. అప్పటికే ఆ మూవీయే హిట్ అందులో డౌట్ లేదు. అయితే షేర్ పరంగా బాలయ్య సమరసింహారెడ్డి సినిమాను కలిసుందారం రా క్రాస్ చేయలేదని అంటారు. అయితే వెంకీ ఫ్యాన్స్ మాత్రం అప్పటికి తమదే ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకున్నారు. అయితే ఇది రీమేక్ మూవీ అని కొందరు ఈ సినిమా రికార్డ్‌ను కొట్టి పడేశారు.
ఖుషీ :
2001లో విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఖుషి. ఇది ఇండస్ట్రీ హిట్ అని పవన్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునేవారు. అయితే షేర్ పరంగాను. రికార్డుల పరంగాను నరసింహానాయుడు మూవీకి ఇది ఏ మాత్రం దరిదాపుల్లో లేదని.. ఇది ఇండస్ట్రీ హిట్ ఎలా ? అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ వాదించేవాళ్లు. నరసింహానాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడితే ఖుషీ 79 కేంద్రాల్లోనే 100 రోజులు ఆడింది.
సింహాద్రి :
2003లో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి ఇంతకు ముందు ఇండస్ట్రీ హిట్ ఇంద్రను క్రాస్ చేసిందని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 50 – 100 రోజులు 175 రోజుల్లో ఇంద్ర రికార్డులను సింహాద్రి తుత్తునీయలు చేసేసింది. అయితే షేర్ పరంగా ఇంద్రకే ఎక్కువ వసూళ్లు వచ్చాయని మెగాస్టార్ ఫ్యాన్స్ అంటారు. ఇప్పటకీ ఎన్టీఆర్, మెగాభిమానుల మధ్య ఇంద్ర వర్సెస్ సింహాద్రి సినిమాల మధ్య డిబేట్ నడుస్తూనే ఉంటుంది.
దూకుడు :
2011లో బ్లాక్ బస్టర్ అయిన దూకుడు ఇండస్ట్రీ హిట్ అని స్వయానా నిర్మాతలే స్టేట్‌మెంట్ ఇచ్చుకున్నారు. అయితే ఇది చెర్రీ మగధీరను క్రాస్ చేయకుండా ఎలా ? ఇండస్ట్రీ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ వాదన. అయితే కొన్ని సెంటర్లలో కావాలని మగధీర కంటే ఎక్కువ రోజులు ఆడేలా మహేష్ అభిమానులు చేశారని.. మగధీర రికార్డుల ముందు దూకుడు ఎందుకు పనిచేయదని మెగా అభిమానులు అంటారు.