తెలుగులో వరుస పెట్టి భారీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అఖండ – పుష్ప – రాధేశ్యామ్ – త్రిబుల్ ఆర్.. తాజాగా కేజీయఫ్ 2 ఇప్పుడు ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆచార్య సైతం థియేటర్లలోకి దిగుతోంది. మూడేళ్ల నుంచి సస్పెన్స్‌తో ఊరిస్తూ వస్తోన్న ఆచార్య ఎట్టకేలకు ఈ నెల 29న థియేటర్లలోకి రాబోతోంది. తొలిసారిగా చిరంజీవి – రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మెగాభిమానుల ఆనందం మామూలుగా లేదు.
పైగా సూపర్ హిట్లతో ప్లాప్ అన్న పదం లేకుండా స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్న కొరటాల శివ దర్శకుడు. అటు ఇద్దరు ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు.. సోనూ సుద్ విలన్.. ఇలా చాలా అంశాలు ఆచార్యపై హైప్‌ను స్కై రేంజ్‌కు తీసుకుపోయాయి. పైగా నెలన్నర రోజుల్లోనే చెర్రీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చెర్రీ తాజా బ్లాక్‌బస్టర్ త్రిబుల్ ఆర్ ఇప్పటికే రు. 1100 కోట్ల వసూళ్లకు చేరువ అయ్యింది.
ఇక తొలిసారిగా చిరు, చరణ్ నటిస్తోన్న మల్టీస్టారర్ కావడం.. కొరటాల డైరెక్టర్ అవ్వడంతో ఆచార్యకు వరల్డ్‌వైడ్‌గా అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఆచార్యకు వరల్డ్ వైడ్‌గా రు. 133 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో అయితే ఏకంగా రు. 42 కోట్లకు ఈ సినిమా రైట్స్ వరంగల్ శ్రీను దక్కించుకున్నారు. ఇది బాహుబలి రేంజ్‌లో కొన్నట్టే లెక్క. ఈ మొత్తం ఇక్కడ రికవరీ కావాలంటే ఆచార్య ఎంతో పెద్ద హిట్ అవ్వాలి.
అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాను భారీ రేట్లకే అమ్మారు. రు. 133 కోట్ల షేర్ అంటే లాంగ్ రన్లో కనీసం రు. 200 కోట్లకు తగ్గకుండా గ్రాస్ వసూళ్లు ఆచార్య రాబట్టాల్సి ఉంటుంది. అటు ఏపీలో ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్‌లలో సైతం ఈ సినిమాను చిరు గత సినిమాలతో పోలిస్తే భారీ రేట్లకే అమ్మారు. కర్నాకటలో కూడా ఆచార్యకు అదిరిపోయే రేట్లు ఇచ్చారు.
అయితే ఈ సినిమాకు రెండు రోజుల ముందే ఎఫ్ 3 సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు. నైజాంలో రాజుకు గట్టి పట్టు ఉంది. అక్కడ ఎఫ్ 3కు కూడా భారీగానే థియేటర్లు కేటాయిస్తున్నారు. ఇటు ఉత్తరాంధ్రలోనూ అదే పరిస్థితి ఉంది. ఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఎఫ్ 3పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకు కూడా ఎక్కువ రేట్లే ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఆచార్య ఈ భారీ టార్గెట్‌ను ఎలా చేధిస్తుందో ? చూడాలి.