Newsదక్షిణాదిలోనే బంగారం ఎక్కువ

దక్షిణాదిలోనే బంగారం ఎక్కువ

బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు అనాదిగా వస్తున్న అలవాటు. బంగారం ధరించడమంటే మహా ఇష్టం. అంతేకాదు, తమ ఆస్తులను నగదు రూపంలో దాచుకోవడం కంటే.. బంగారంగా మార్చుకుంటే భవిష్యత్తు స్వర్ణమయం అవుతుందనే నమ్మకం కూడా ఎక్కువే. అందుకే, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండు తగ్గినా.. ఇండియాలో మాత్రం పీక్ స్థాయిలో ఉంది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి సంబందించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక ‘కళ్లు’ జిగేల్ అనిపించే స్థాయిలో ఇండియాలో బంగారం అమ్మకాలు ఉన్నాయి.

వస్తు సేవల పన్ను (GST) అమలు లోపే బంగారు కొనుగోలు చేసుకోవాలనేది కూడా అమ్మకాలకు కారణం. అలాగే, నోట్ల రద్దు తర్వాత నగదును బంగారం రూపంలో దాచుకోవాలేనే ఆలోచన కూడా చాలామందిలో కలిగింది. ఫలితంగా పసిడిపై పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా వివాహ సమయంలో వీటి కొనుగోళ్లు మరింత అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్ – జూన్ మధ్య పసిడి విక్రయాలు బాగా జరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా 37 శాతం కొనుగోళ్లు మన దేశంలోనే జరిగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news