సినిమా అనేది ఒక రంగుల మయం. ఇక్కడ ఎందరో మరెందరినో కలుస్తూ ఉంటారు. కొన్ని కలయికలు ప్రేమగా మారి పెళ్లి వరకు వెళుతుంటాయి. మరి కొన్ని మాత్రం మధ్యలోనే విషాద ప్రేమకథలుగా మిగిలిపోతాయి. అదే విధంగా మన తెలుగు సినిమా పరిశ్రమలో సైతం అలాంటి ప్రేమకథలు ఎన్నో ఉన్నాయి. అయితే అవి ఏమిటో ? ఎవరెవరికి మధ్య ఈ ప్రేమకలాపాలు జరిగాయో చూద్దాం.
సమంత – సిద్దార్ధ్:
సిద్దార్ధ్ నటుడిగా వరుస హిట్ లు సాధించిన రోజులలో స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమాయణం నడిపాడు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్ళింది. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యతో కనెక్ట్ అయ్యి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా విడిపోయారు.
రానా – త్రిష:
ఇండస్ట్రీలో సహజంగా స్నేహం ఉండడం మాములే. కానీ కొన్ని సార్లు ఆ స్నేహం ప్రేమ వరకు వెళుతుంది. అదే విధంగా రానా – త్రిష ప్రేమించుకున్నారు. అప్పట్లో వీరిద్దరికి సంబంధించిన డేటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వీరు ఆ తర్వాత విడిపోయారు.
రిచా గంగోపాధ్యాయ్ – సింగర్ రామ్:
అప్పుడప్పుడే హీరోయిన్ గా స్థిరపడుతున్న రిచా.. సింగర్ రామ్ ఇద్దరూ ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈమె కోసం రామ్ చనిపోవడానికి కూడా రెడీ అయ్యాడట. కానీ ఈ గోలంతా ఎందుకని రిచా ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఇతర దేశాలకు వెళ్లిపోయి ఉన్నత విద్యాభ్యాసం చేసి అక్కడ ఎన్నారైను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
పవన్ – రేణు – అన్నా:
పవన్ కళ్యాణ్ తన జీవితంలో మూడు ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ముందుగా రేణుదేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత రష్యా భామ అన్నా లెజినోవాతో ప్రేమలో పడి రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ అన్నాతో కలిసి ఉండగా, రేణు మాత్రం తన ఇద్దరు పిల్లలతో హ్యాపీ గా ఉంది.
ఇలియానా – ఆండ్రు:
తన సన్నని నడుముతో కుర్రకారుకు చెమటలు పట్టించిన గోవా బ్యూటీ ఇలియానాకు కూడా ఒక ప్రేమ కథ ఉంది. ఈమె ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఐ. ఆండ్రు ( సర్దార్ గబ్బర్‌సింగ్ సెకండ్ యూనిట్ సినిమాటోగ్రాఫర్) తో డేటింగ్ చేసింది. వీరు పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చినా.. ఆ వెంటనే మనస్పర్థలతో విడిపోయారు.
శింబు – హన్సిక:
తమిళ నటుడు శింబు మరియు హన్సిక గురించి లోకమంతా తెలుసు. వీరిద్దరూ చాలా కాలం పాటు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారు. శింబు హన్సికతో డేటింగ్ చేయడానికి ముందే నయనతారతో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్లాడు. ఆమెతో బ్రేకప్ తర్వాత హన్సికను పట్టాడు.
వరుణ్ సందేశ్ – శ్రద్ధాదాస్:
కొత్తబంగారులోకం సినిమాతో యువకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కూడా శ్రద్ధదాస్ తో ప్రేమలో ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మీడియాలో ఈ విషయం హైలైట్ అవ్వగానే మేమిద్దరం ఫ్రెండ్స్ అని తప్పించుకున్నారు. ఆ తర్వాత వరుణ్..తనతో ఓ సినిమాలో హీరోయిన్గా చేసిన వితిక షేరును పెళ్లి చేసుకున్నాడు.
ఇలా ఇంకా ఎన్నో ప్రేమకథలు మన టాలీవుడ్ లో ఉన్నాయి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోకుండా డేటింగ్ పేరుతో విడిపోవడం అయితే మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఈ పాశ్చాత్య సంస్కృతికి చరమగీతం పాడాలి.