ఏపీలోని విజయవాడకు చెందిన అమ్మాయి రంభ. రెండు దశాబ్దాల క్రిందట బోల్డ్ క్యారెక్టర్లతో టాలీవుడ్‌లో టాప్ లేపేసింది. రంభ స్వస్థలం విజయవాడ.. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విజయలక్ష్మి పేరు బాగోలేదని రంభగా మార్చేశారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు దృష్టిలో పడడంతో ఆమె గ్లామర్ ఇమేజ్‌ను ఆయన బాగా చూపించారు. హీరోయిన్ల అందాలను ఎలా ఎక్కడ ? చూపించాలో రాఘవేంద్రుడికి తెలిసినట్టుగా మరెవ్వరికి తెలియదు. రంభను కూడా ఆయన సినిమాల్లో బాగా చూపించారు. ఆ తర్వాత తక్కువ టైంలోనే రంభ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవితోనే హిట్లర్, బావగారు బాగున్నారా లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. హిట్లర్‌లో చిరుకు అల్లరి మరదలిగా అదరగొట్టేసింది. కాస్త లేట్ ఏజ్‌లో కూడా కెరీర్ కంటిన్యూ చేసిన రంభ సౌత్ తర్వాత భోజ్‌పురిలోకి ఎంట్రీ ఇచ్చింది. భోజ్‌పురిలో అయితే మనోజ్ తివారి – రవికిషన్ సింగ్ లాంటి హీరోల పక్కన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. భోజ్‌పురి ప్రజలు రంభను ఆరాధ్య దేవత అని పిలిచేవారు. అక్కడ ఆమెకు మామూలు క్రేజ్ రాలేదు. ఇప్పటకీ ఆమెకు అక్కడ అంతే ఫాలోయింగ్ ఉంది.
ఆ తర్వాత కెనడాలో ఉండే ఎన్నారై ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మధ్యలో భర్తతో ఏవేవో డిస్టబెన్సెస్ కూడా వచ్చాయి. విడిపోవాలని కూడా అనుకుంది. అయితే ఇండస్ట్రీలో ఆమె సన్నిహితులు సర్దిచెప్పడంతో చివరకు కలిసి కాపురం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత రంభ తిరిగి వెండితెర మీద కనిపించబోతోంది.
పైగా ఆమె సౌత్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా వస్తోన్న సర్దార్ సినిమాతో ఆమె మళ్లీ తెరపై కనువిందు చేయనుంది. ఈ సినిమాను పీఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రంభకు సౌత్ టు నార్త్ ఫుల్ పాపులారిటీ ఉంది. అప్పట్లో బోల్డ్‌నెస్‌కు రంభ కేరాఫ్ అడ్రస్.
రంభ ఇప్పుడు అయినా ఎంట్రీ ఇస్తే ఆమె ఫ్యాన్స్ ఖచ్చితంగా సినిమాలు చూస్తారు. అందుకే సూపర్‌స్టార్ మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమాలో సైతం ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమె తన అభిమానులను అలరిస్తుండడం హ్యాపీ మూమెంటే..!