ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టే ఉంది. గత రెండేళ్లుగా కరోనా వచ్చినప్పటి నుంచే సౌత్ టు నార్త్ హీరోలు, హీరోయిన్లు వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నిఖిల్, రానా, నితిన్ వీళ్లందరు ఈ టైంలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారు అయ్యారు. అటు బాలీవుడ్లో సీనియర్ హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. కత్రినా కైఫ్, అలియాభట్ కూడా రీసెంట్‌గానే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకే పవన్ కళ్యాణ్ హీరోయిన్గా కూడా వచ్చి చేరుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో సౌత్‌కు హీరోయిన్గా పరిచయం అయ్యింది నికిషా పటేల్. తొలి సినిమాతోనే పవన్ లాంటి హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసినా ఆమెకు కాలం కలిసి రాలేదు. పులి సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఇక్కడి వాళ్లెవ్వరు ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత అడపా దడపా కొన్ని ఛాన్సులు వచ్చినా ఆ సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. కళ్యాణ్ రామ్‌తో ఆమె చేసిన సినిమా కూడా ఆడలేదు. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ కూడా కొన్ని ప్రయత్నాలు చేసినా ఆమె కెరీర్‌కు అవి కలిసి రాలేదు.
ఆ తర్వాత లండన్ వెళ్లిపోయి అక్కడ రేడియో జాకీగా పని చేస్తోంది. అలాగే ఫ్యాషన్ టీవీ యాకంర్‌గా కూడా చేస్తోంది. తాజాగా నికిషా తన పెళ్లి మేటర్ బయటపెట్టింది. తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు కావాల్సిన వాడు దొరికేశాడని.. బ్రిటన్‌లోనే అతడిని వెతికి పట్టుకున్నాను అని నికిషా చెప్పింది. అతడితోనే తన పెళ్లి త్వరలోనే జరగబోతోందని చెప్పిన నికిషా అతడు ఇండియనా, బ్రిటీషరా అన్నది మాత్రం చెప్పలేదు.
ఇక తెలుగులో కొమరం పులి సినిమాతో జర్నీ స్టార్ట్ చేసినా నికిషా ఆ తర్వాత తమిళ్లో కూడా వెళ్లి కొన్ని సినిమాలు చేసింది. అక్కడ కూడా ఆమె చేసిన సినిమాలు తన్నేశాయ్. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ ఆమెకు లక్ కలిసి రాలేదు. చివరకు ఇండియాలో హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అని ఓ డైలాగ్ వేసి లండన్ చెక్కేసింది. ఆమె లండన్‌కు వెళ్లి చాలా రోజులు అయిపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇక్కడ అప్డేట్స్ ఫాలో అవుతూ టచ్‌లోనే ఉంటూ వస్తోంది.
తనతో నటించిన హీరోలతో పాటు స్టార్ హీరోల బర్త్ డేలకు విషెస్ చెపుతూ ఉంటుంది. చాటింగ్‌లో కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తూ వచ్చే నికిషా ఓ నెటిజన్ నీ పెళ్లెప్పుడు అని అడిగిన ప్రశ్నకే పై ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం లండన్‌లోనే తన ప్రియుడితో కలిసి ఆమె డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి నికిషాకు కాబోయే వరుడు ఎవరో ? చూడాలి.