Moviesమురళీమోహన్‌తో ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి వెనుక ఏం జరిగింది... ఈ...

మురళీమోహన్‌తో ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి వెనుక ఏం జరిగింది… ఈ అనుమానాలెందుకు…!

సినిమా రంగం అనేది గ్లామర్ ఫీల్డ్. ఈ గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్లు.. హీరోలతో సినిమాలు చేసే క్రమంలో సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అలాగే హీరోయిన్లు, ద‌ర్శ‌కుల‌ ఈ మధ్య కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. ఇక సినిమా రంగంలో సెలబ్రిటీల గురించి మీడియా అటెన్షన్ ఎలా ? ఉంటుందో చెప్పక్కర్లేదు. నాలుగైదు దశాబ్దాల క్రితం మీడియా ప్రభావం అంతగా ఉండేది కాదు. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది. అప్పుడు కాగడా ఇలాంటి ఒక‌టి రెండు సినీ వార పత్రికలు మాత్రమే సినిమా వాళ్ల గురించి ఎక్కువగా రాస్తూ ఉండేవి.

ఇక ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు సినిమాల్లో నటిస్తే చాలు… వారిద్దరి మధ్య ఏదో ఉందని ఒకటే పుకార్లు అల్లేస్తున్నారు. అస‌లు హీరో, హీరోయిన్ల మ‌ధ్య ఏమీ లేక‌పోయినా.. ఏదో ఒక‌టి రాసేస్తూ సినిమా వాళ్ల ఫ్యామిలీ ప‌రువును బ‌జారులో పెట్టేస్తున్నారు. గ‌తంలో సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్‌, హీరోయిన్ జ‌య‌చిత్ర‌పై ఇలాంటి రూమ‌రే పుట్టుకు వ‌చ్చింది. అప్ప‌ట్లో ముర‌ళీమోహ‌న్ ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ త‌న‌దైన స్టైల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు.

ముర‌ళీమోహ‌న్ – జ‌య‌చిత్ర కాంబినేష‌న్‌కు మాంచి క్రేజ్ ఉండేది. వీరిద్ద‌రు క‌లిసి చాలా సినిమాల్లో న‌టించారు. సినిమా షూటింగ్‌లు ముగిశాక మ‌ద్రాస్ బీచ్‌లు, హోట‌ల్స్‌లో ఈ జంట ఎక్కువుగా క‌న‌ప‌డేవార‌ట‌. దీంతో మ‌ద్రాస్ సినిమా ప‌త్రిక‌ల వాళ్లు కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు లాగేశారు. వీరిపై ఓ క‌న్నేసి ఉంచారు. ఓ రోజు వాహినీ స్టూడియోలో ముర‌ళీ మోహ‌న్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ద్రాస్ విలేక‌ర్లు మీరు జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకోబోతున్నారా ? అని అడిగేయ‌డంతో ఆశ్చ‌ర్యపోవ‌డం ఆయ‌న వంతు అయ్యింద‌ట‌.

నేను జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకోవ‌డం ఏంటంటి.. నాకు ఆల్రెడీ పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నార‌ని చెప్పార‌ట‌. అయితే త‌మిళ్ సినీ వార‌పత్రిక దిన‌తంతిలో జ‌య‌చిత్ర‌తో ముర‌ళీమోహ‌న్ పెళ్లి అయిపోయిన‌ట్టు ఓ ఫొటో కూడా వేసేశార‌ట‌. దీంతో ఇండ‌స్ట్రీలో వీరిద్ద‌రి పెళ్లి ఒక‌టి రెండు రోజుల పాటు అంద‌రిని ఊపేసింద‌ట‌. ఇక ముర‌ళీమోహ‌న్‌ను చిత్ర రంగానికి పరిచ‌యం చేసిన నిర్మాత అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు ఓ సారి ముర‌ళీమోహ‌న్‌ను పిలిపించుకుని బాబు నువ్వు జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకోబుతున్నావా ? అని నేరుగానే అడిగేశార‌ట‌.

దీంతో షాక్ అయిన ముర‌ళీమోహ‌న్ … మీరు పొర‌పాటు ప‌డుతున్నారు.. మేం స‌న్నిహితంగా మాత్ర‌మే ఉంటున్నాము.. మా మ‌ధ్య అలాంటిదేమీ లేద‌ని చెప్పేశార‌ట‌. చివ‌ర‌కు మ‌ద్రాస్ నుంచి వీరిద్ద‌రు క‌లిసి ఫ్లైట్లో హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ట‌. అప్పుడు ఇక్క‌డ మీడియాలో కూడా ముర‌ళీమోహ‌న్ – జ‌య‌చిత్ర పెళ్లి వ్య‌వ‌హారం గురించి ఇక్క‌డ మీడియా అడ‌గ‌డంతో చివ‌ర‌కు వాళ్లిద్ద‌రు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఖండించుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. త‌ర్వాత ఈ వార్త వేసిన ఆ త‌మిళ్ ప‌త్రిక్ష వీళ్లిద్ద‌రికి క్ష‌మాప‌ణ కూడా చెప్పింద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news