మెగాస్టార్ రెండో డాటర్ శ్రీజ కొణిదెల గత కొద్ది రోజులుగా మీడియాలో వ్యక్తిగా మారారు. శ్రీజ అంతకు ముందు ఇంట్లో తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కినా పెద్దగా బయట వార్తల్లో ఉండేవారు కాదు. అయితే రెండో మ్యారేజ్ జరగడం.. చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్‌దేవ్‌ను శ్రీజ రెండో పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు కళ్యాణ్‌కు దూరంగా ఉంటున్నారన్న వార్తలతో శ్రీజ వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి తోడు శ్రీజ కళ్యాన్గా ఉన్న తన సోషల్ మీడియా అక్కౌంట్లలో పేరు శ్రీజ కొణిదెలగా మార్చుకోవడంతో రకరకాల అనుమానాలు, సందేహాలు వస్తూనే ఉన్నాయి.
అయినా సోషల్ మీడియాలో ఆమె పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. కొద్ది రోజుల క్రితం శ్రీజ తన సోదరుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి ముంబై వెళ్లారు. ఈ టూర్ ఏంటన్న ప్రశ్నలకు అది బిజినెస్ టూర్ అన్న టాక్ బయటకు వచ్చింది. శ్రీజ – కళ్యాన్ మధ్య గ్యాప్ వార్తలు బయటకు వచ్చినప్పుటి నుంచి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న ప్రతి పోస్ట్ వైరల్ అవుతూనే వస్తోంది.
తాజాగా శ్రీజ తన ఇన్‌స్టాలో ఓ ఇంట్రస్టింగ్ కొటేషన్‌తో ఓ పోస్టు షేర్ చేసింది. మనం ఎదుటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఏదైతే ఇస్తామో అదే మనకు 100 రెట్లు తిరిగి వస్తుందని రాసుకువచ్చింది. ఈ ఇన్ స్టా స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇప్పుడు ఆ పోస్టు స్క్రీన్ షాట్ తీసి మరీ వైరల్ చేస్తున్నారు.
శ్రీజ ఎవరిని ఉద్దేశించి ఆ కౌంటర్ వేశారు ? లేదా క్యాజువల్‌గా పెట్టిన పోస్టా ? అన్నది అర్థం కావడం లేదు. గత కొంత కాలంగా ఆమె భర్తకు దూరంగానే ఉంటున్నారని అంటున్నారు. కళ్యాణ్‌దేవ్ ఎక్కువుగా అమెరికాలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. శ్రీజ మాత్రం తల్లిదండ్రుల దగ్గర తన ఇద్దరు పిల్లలతోనే కలిసి ఉంటున్నారు.
ఇక శ్రీజ ముందుగా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా 2008లోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. చిరు రాజకీయాల్లోకి రావడానికి ముందు ఈ పెళ్లి జరిగింది. వీరికి ఓ పాప పుట్టాక శిరీష్ టార్చర్ తట్టుకోలేక తాను విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పిన శ్రీజ అతడికి దూరమైంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఆమెకు కళ్యాణ్‌దేవ్‌తో రెండో పెళ్లి చేశారు. వీరికి కూడా ఓ బిడ్డ పుట్టాక గ్యాప్ వచ్చిందని అంటున్నారు.