కథ విషయానికొస్తే.. ఎస్.ఐ అవ్వాలని కలలు కంటున్న రామారావు (సందీప్ కిషన్) ఆ క్రమంలో చివరి ఎగ్జామ్ రాసేప్పుడు రాహుల్ (తనీష్) రామారావుని ఎక్సాం రాయనియకుండా అడ్డుపడతాడు. పాత కక్షతో అలా చేయగా ఇక ఎస్.ఐ ఛాన్స్ మిస్సైన రామారావు పూర్తిగా డిస్ట్రబ్ అవుతాడు. ప్రేమికురాలు జమున (రెజినా) రామారావుకి ఓ పోలీస్ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. అలెగ్జాండర్ పేరుతో ఉన్న ఆ యూనిఫాంతో తన పోలీస్ సరదా తీర్చుకుంటాడు రామారావు. ఇలా ఉండగా రామారావు అలెగ్జాండర్ యూనిఫాం చూసిన మరో పోలీస్ కిరణ్ రెడ్డి (ప్రగ్యా జైశ్వాల్) అతన్ని కమీషనర్ ప్రకాష్ రాజ్ దగ్గరకు తీసుకెళ్తుంది.
అసలు ఎవరీ అలెగ్జాండర్ .. అతని గురించి అందరు వెతుకుతున్నారు..? పోలీస్ ఆఫీసర్ అయిన అలెగ్జాండర్ ఎలా మాయమయ్యాడు..? రామారావు ఈ గొడవల నుండి ఎలా బయటపడ్డాడు అన్నది అసలు కథ. నటీనటుల పరంగా.. రామారావుగా తన సహజ నటనతో సందీప్ కిషన్ ఆకట్టుకోగా.. అలెగ్జాండర్ గా ఉన్న కొద్ది సేపే అయినా సరే ఊపు ఊపేశాడు సాయి ధరం తేజ్. ఇక రెజినా, ప్రగ్యా జైశ్వాల్ అందాలను అద్భుతంగా తెర మీద చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. ముఖ్యంగా సినిమాలో ప్రగ్యా నటనకు అందరు ఫిదా అవడం ఖాయం. ప్రకాశ్ రాజ్, జెడి చక్రవర్తి బాగానే చేశారు. ఇక విలన్ గా తనీష్ మొదటి ప్రయత్నమే అయినా ఇంప్రెస్ చేశాడు.
కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం.. మొదటి భాగం ల్యాగ్ అవడం సినిమాలో మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. కృష్ణవంశీ డైరక్షన్ బాగుంది. భీమ్స్ , భరత్, హరి ల మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అవలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కాస్త బాగుందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ కథనాల్లో ఇంకాస్త కొత్తదనం ఉంటే బాగుండేదని చెప్పొచ్చు. నక్షత్రం అంటూ రొటీన్ కథకే మళ్లీ రంగులద్ది తెచ్చాడు కృష్ణవంశీ.
బాటం లైన్ : రొటీన్ కథ కాసిన్ని మెరుపులతో నక్షత్రం..!
రేటింగ్ : 2.5/5