మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. సైరా నరసింహారెడ్డి లాంటి సినిమా తర్వాత మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని చిరు చేసిన సినిమా ఇదే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరుతో పాటు తనయుడు రామ్‌చరణ్ కూడా సిద్ధాగా కీలక పాత్రలో కనిపిస్తాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీకి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.
ఆచార్య ఇటు ఎఫ్ 3 సినిమాతో పాటు తెలుగు, తమిళ్‌లో వస్తోన్న విజయ్ సేతుపతి కేఆర్‌కే సినిమాల మధ్యలో రిలీజ్ అవుతోంది. రు. 100 కోట్లకు పైగానే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగినా కొన్ని డౌట్లు మాత్రం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అసలు ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ ప్రస్తావనే కనిపించకపోవడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
ట్రైలర్ రిలీజ్‌కు ముందు కాజల్ మెయిన్ హీరోయిన్.. పూజాది చెర్రీకి జోడీగా ఓ 30 నిమిషాల పాటు మాత్రమే ఉండే పాత్ర అన్నారు. తీరా ట్రైలర్లో చూస్తే అంతా షాకింగ్… పూజా పాత్ర రొమాంటిక్‌గా బాగుంది. అసలు కాజల్ పాత్రే లేకపోవడంతో ఏం జరుగుతుందా ? అన్నది అర్థం కావడం లేదు. ఆచార్యలో చిరుకు జోడీగా మెయిన్ హీరోయిన్ కాజలే. ఆ టైంలో ఆమెకు పెళ్లవ్వడంతో పాటు ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. అందుకే ఆమె రోల్ ఏదైనా తగ్గించారా ? అని కొందరు డౌట్లు పడుతున్నారు.
ఇప్పుడు ట్రైలర్‌లో ఆమె కనపడకపోవడంతో కొరటాల ఆమె రోల్ గురించి ట్విస్ట్ ఇస్తారా ? ఆమెను కావాలానే దాచేశారా ? అన్న చర్చలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి. కమర్షియల్ సినిమాలో మెయిన్ హీరోకు జోడీగా హీరోయిన్ ఉన్నప్పుడు ఆమె గురించి చిన్న కట్స్ అయినా ట్రైలర్లో చూపించాలి. అసలు ట్రైలర్లో ఆమె ప్రస్తావనే లేకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి సినిమా కాజల్ పాత్రపై కొరటాల ఏం ట్విస్టులు, షాకులు ఇస్తాడో ? చూడాలి.