భారీ అంచనాల మధ్య ఈ రోజు కేజీయఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇటీవల సౌత్ సినిమాలు నార్త్‌ను ఏలేస్తోన్న వేళ పుష్ప, త్రిబుల్ ఆర్ పరంపరలోనూ దేశవ్యాప్తంగా ఈ కన్నడ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కేజీయఫ్ చాప్టర్ 1 హిట్ అవ్వడంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా ? అని ప్రతి ఒక్క మూవీ లవర్ ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఈ రోజు రిలీజ్ అయిన కేజీయఫ్ 2 ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది.
ఓవర్సీస్ టాక్ ప్రకారం సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం. కేజీయఫ్ 1 లాగానే ఆనంద్ వాసిరాజు కొడుకు విజయేంద్ర వాసిరాజు ( ప్రకాష్ రాజ్) చాప్టర్ 2 స్టోరీని ఛానెల్ ఎడిటర్‌కు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆధ్యాయం 2 ప్రకారం మైనింగ్ సిటీ నారాచీలో రాకీభాయ్ జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో రాకీ రెండు వ్యవస్థలతో పోరాటం చేయాల్సి వస్తుంది. అటు అధీర ( సంజయ్ దత్) గ్యాంగ్‌తో పాటు ఇటు భారత ప్రభుత్వంతోనూ పోరాడతాడు.
ఓవరాల్‌గా చూస్తే కేజీయఫ్ 2 యాక్షన్ సీక్వెన్స్‌ల పరంగా మెస్మరైజ్ చేసేసింది. అయితే కథా పరంగా చూస్తే పార్ట్ 1ను ఏ మాత్రం అందుకోలేదు. అయితే యాక్షన్స్ పరంగా మాత్రం సినిమా హెవీగా ఉంది. ఓవర్ ద టాప్ హీరోయిజం ఎలివేషన్ మీదే దర్శకుడు కాన్‌సంట్రేషన్ చేశాడే తప్పా ఇతర అంశాలపై దృష్టి పెట్టలేదు. కేజీయఫ్ ఫ్యాన్స్ ఎలాంటి ఎలివేషన్ల మీద ఆశలు పెట్టుకుంటారో ? ఆ విషయంలో నీల్ సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాలో రాకీ వర్సెస్ అధీర వివాదం సరిగా ఎస్టాబ్లిష్ చేయబడలేదు. చాప్టర్ 1తో పోలిస్తే ఎక్కడో అంచనాలు తగ్గాయనిపిస్తుంది. హీరోయిజం, ఎలివేషన్ సీన్లు మాత్రం సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళతాయి. బ్రీఫ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అధీర ఎంట్రన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవన్నీ మైండ్ బ్లాగింగ్ సీన్స్ అని చెప్పాలి. పీఎంను హెచ్చరించడానికి రాకీ నేరుగా పీఎంవోకు వెళ్లడం.. రాజకీయ నేతను చంపేందుకు రాకీ నేరుగా పార్లమెంటు హాలులోకి వెళ్లడం సరిగా హీరోయిజంను ఎలివేట్ చేయలేదు. ఓవరాల్‌గా మాత్రం సినిమా పర్వాలేదు.
కొన్ని అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ షాట్స్ రూపొందించిన నీల్… కథ మీద అంత దృష్టి పెట్టలేదు. కేజీయఫ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చే ఈ సినిమా సాధారణ సినిమా అభిమానులకు జస్ట్ ఓకే అనిపిస్తుంది.