మన ఇండియాలో ఏ భాషలో అయినా ఓ పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే అభిమానుల అంచనాలు, హంగామా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు. సినిమా హిట్ అవ్వాలని ముందు రోజు నుంచే పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టడంతో పాటు పాలాభిషేకాలు, గజమాలలు వేసి హడావిడి చేస్తారు. మన రాయలసీమలో అయితే పోతులను కూడా బలి చేస్తూ ఉంటారు. ఇక సినిమా రిలీజ్ రోజు హిట్ అయితే పాలాభిషేకాలు, పూలాభిషేకాలతో మామూలు హంగామా ఉండదు.
ఒక వేళ సినిమాకు బాగోలేదని టాక్ వస్తే పోస్టర్లు చించేస్తూ ఉంటారు.. పోస్టర్లకు పేడ కొడుతూ ఉంటారు.
ఇవన్నీ గత కొన్నేళ్లుగా మనం చూస్తేనే ఉన్నాం. అయితే ఈ రోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ బీస్ట్ రిలీజ్ వేశ మరీ ఓవర్ అయిపోయారు. నోటికి కాకుండా చేతికి పని చెప్పేశారు. బీస్ట్ నచ్చకపోవడంతో ఏకంగా థియేటర్‌కే నిప్పంటించారు. కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ – పూజా హెగ్డే జంటగా వరుణ్ డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా రు. 120 కోట్ల భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన యుద్ధం స్టార్ట్ చేసింది. ఈ సినిమాకు ఈ రోజు తెల్లవారు ఝామునుంచే బెనిఫిట్ షోలు పడిపోయాయి. అయితే సినిమా తమ అంచనాలకు అనుగుణంగా లేదని విజయ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు అనుకున్నంత టాక్ అయితే రాలేదు.
ఈ క్రమంలోనే తమిళనాడులోని ఓ థియేటర్లో సినిమా చూస్తున్న కొందరు విజయ్ వీరాభిమానులు బీస్ట్ సినిమా నచ్చకపోవడంతో ముందుకు వెళ్లి స్క్రీన్కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సినిమా నచ్చకపోతే థియేటర్‌కు నిప్పంటిస్తారా ? అని థియేటర్ యజమానుల సంఘాలు విజయ్ ఫ్యాన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— 🔥 Ajith Kumar🔥 (@Anythingf4AJITH) April 13, 2022