మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ సోలో హీరోగా గద్దలకొండ గణేష్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ తేజ్ రేంజ్‌తో పాటు మార్కెట్ కూడా పెరిగింది. దీంతో గని సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 23 కోట్ల థియేట్రిలక్ బిజినెస్ జరిగింది. రు. 24 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి గని దిగింది. పైగా అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా ఉండడం.. ఇటు బన్నీ సైతం ఈ సినిమాకు ప్రమోషన్ చేయడంతో సినిమాలో ఖచ్చితంగా విషయం ఉండే ఉంటుందనే అందరూ అనుకున్నారు.
అయితే తొలి రోజుకే గనిలో విషయం లేదని తేలిపోయింది. కొత్త డైరెక్టర్ కిరన్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరోలు జగపతిబాబుతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి తదితరులు నటించారు. అలాగే నదియా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న థమన్ మ్యూజిక్ ఇచ్చారు. పైగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కనిపించింది. దీంతో సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అందరూ అనుకున్నారు.
తొలి రోజే సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో రెండు రోజులకే సినిమా డిజాస్టర్ అన్నది తేలిపోయింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రు 2.22 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకే పూర్తిగా చేతులు ఎత్తేసింది. రెండో రోజు ఏపీ, తెలంగాణలో కేవలం 72 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే రెండు రోజులకు కలిపి చూస్తే 2.94 కోట్ల షేర్‌తో పాటు రు 5.35 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇక కర్నాకట, ఓవర్సీస్‌తో కలుపుకుని 20 లక్షల షేర్ రాబట్టిన గని.. ఓవర్సీస్‌లో మరో 25 లక్షల షేర్ రాబట్టింది. అంటే రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 3.39 కోట్ల షేర్.. 6.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అసలు సెలవులు, ఫస్ట్ వీకెండ్… శ్రీరామనవవి… ఇవన్నీ కలిసి వచ్చినా ఇంత దారుణమైన వసూళ్లు ఉన్నాయంటే.. ఇక సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు ఇంకెంత దారుణంగా ఉంటాయో ? అన్న చర్చలు అయితే ట్రేడ్ వర్గాల్లో స్టార్ట్ అయ్యాయి.
ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై అయినా వరుణ్ తేజ్ కథలపై మరింత జాగ్రత్తలతో ఉంటేనే మార్కెట్ నిలబడుతుంది. అసలు ఈ కథను వరుణ్ మైత్రీ వాళ్ల దగ్గరకు పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేశారు. చివరకు అల్లు బాబితో పాటు మరో నిర్మాతను కలుపుకుని తీసినా ఫలితం లేకుండా పోయింది.