యంగ్ టైగర్ ఏ ముహుర్తాన బుల్లితెర మీద అడుగుపెట్టాడో కాని మిగతా వారికి ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. స్టార్ మాలో బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్న తారక్ మొదటి వారమే టి.ఆర్.పిలో తన సత్తా ఏంటో చూపించాడు. అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్ అందుకున్న బిగ్ బాస్ మొదటి వారం హవా రెండో వారంలో కూడా కొనసాగించింది. ఈ వారం కూడా బిగ్ బాస్ ప్రోగ్రామే టాప్ ప్లేస్ ను దక్కించుకుందట.
మా నుండి స్టార్ మా చేతుల్లోకి వెళ్లాక ఎప్పుడు టాప్ ప్లేస్ లో లేని స్టార్ మా ఇప్పుడు ఏకంగా రెండు వారాలు టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఎలాంటి సంచలనాలైనా సరే సృష్టించడం తన వల్లే అవుతుందని మరొక్కసారి నిరూపించాడు తారక్. బిగ్ బాస్ హోస్ట్ గా తను చూపించే ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా శని ఆదివారాలైతే ఎన్.టి.ఆర్ కోసమే బిగ్ బాస్ చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. టి.ఆర్.పి రేటింగ్ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న తారక్ ఇదే ఫాం ఈ రియాలిటీ షో పూర్తయ్యే దాకా కొనసాగిస్తాడో లేదో చూడాలి.