దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ RRR. రాజమౌళి దర్శకత్వంలో.. ఎఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్స్ అన్నీ ఇన్ని కావు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఈ సినిమా బాలీవుడ్‌లో రచ్చ లేపుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక తాజాగా మరో రికార్డ్‌ను నమోదు చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొడుతోంది.
మోస్ట్ అవైటెడ్ RRR దేశవిదేశాల్లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ సినిమా ఇంటా బయటా అద్భుత కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేస్తోంది. రకరకాల కారణాలతో కొన్ని పాత రికార్డులు పదిలంగా ఉన్నా ప్రస్తుత క్రైసిస్ సన్నివేశంలో ఈ రిజల్ట్ ఎంతో ఉన్నతమైనది. సినీపరిశ్రమలకు బూస్ట్ ఇచ్చేదేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది. RRR విడుదలైన ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బాహుబలి 2 రికార్డులను మాయం చేసి తనదైన రికార్డులను సృష్టించింది ఆర్ఆర్ఆర్.
తాజా సమాచారం మేరకు RRR కేవలం ఉత్తర అమెరికాలో 100 కోట్లు వసూలు చేసింది. ఇంకా వసూల్ చేస్తోంది. యు.ఎస్‌లో ట్రిపుల్ ఆర్ మూవీ 13.3 మిలియన్ డాలర్స్ మార్క్‌ను చేరుకుంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. బాహుబలి తర్వాత ఆ మార్క్ చేరుకున్న మరో సినిమా RRR మూవీ కావడం విశేషం. . దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉత్తర భారతదేశంలో వసూళ్లు అంతకంతకు పెరుగుతుండడం ట్రేడ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కడి ఆడియన్స్ కూడా సినిమాని ఇంత ఆదరించడంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీగా ఉంది.
India’s Biggest Blockbuster #RRRMovie crosses 100Crore+ gross in North America 💥🇺🇸#RRRinUSA release by @sarigamacinemas @raftarcreations#RRR100CrInNorthAmerica pic.twitter.com/LDuODZS0ZF
— VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) April 9, 2022