Moviesఅక్కినేని ఫ్యామిలీకి అంత సీన్ లేదా..సంచలనంగా మారిన సామ్ మాటలు..?

అక్కినేని ఫ్యామిలీకి అంత సీన్ లేదా..సంచలనంగా మారిన సామ్ మాటలు..?

స్టార్ హీరోయిన్ సమంత ..భర్త తో విడాకులు తీసుకున్న తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఫుల్ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం చేతిలో అరడజనుకి పైగా సినిమాలు పెట్టుకుని ఉన్న ఈ ముద్దుగుమ్మ..త్వరలోనే హాలీవుడ్ సినిమాలో నటించనుంది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు..ఎప్పటికప్పుడు తన మూవీ అప్డేట్స్ గురించి అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే హీరో, హీరోయిన్లకు పలు సంధర్భలల్లో విషెస్ అందిస్తుంది.

కాగా రీసెంట్ గా అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈయన పుట్టిన రోజుకు బడా స్టార్స్ తో పాటి..అటు అభిమానులు..ఇటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంత వరకు బాగానే ఉంది. కానీ పుట్టినరోజుకు మాజీ వదిన..అదేనండి సమంత కూడా విష్ చేసింది. అఖిల్‌ బర్త్‌డే సందర్భంగా సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అంటూ ఫోటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే సమంత పోస్ట్‌పై అఖిల్‌ స్పందించలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


అయితే అఖిల్ రిప్లై ఇవ్వకపోవడం పై చాలా మంది సామ్ ఫ్యన్స్ హర్ట్ అయ్యారు. అక్కినేని కుటుంబానికి పద్ధతులు తెలియవా.. ఆ మాత్రం మర్యాదా లేదా.. వదినా గా కాకపోయిన ఒక ఫ్రెండ్ గా రిప్లై ఇవ్వచ్చుగా..అంత పొగరా ఈ అక్కినేని ఫ్యామిలీ కుర్రాళ్లకి..అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు సాం ఒకప్పుడు అఖిల్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. చైతో విడిపోక ముందు.. సామ్ ఒ ఐంటర్వ్యుల్లో మాట్లాడుతూ..అఖిల్ నాకు చాలా ఇష్టమని..చిన్నపిల్లాడి క్యారెక్టర్ అని..నా కోడుకులాంటివాడు అని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంత మంచి వదినని హర్ట్ చేశావా నువ్వు అంటూ అక్కినేని ఫ్యామిలీ బుతులు తిడుతున్నారు సమంత ఫ్యాన్స్.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news