Moviesహృతిక్‌, సుసానే కొత్త ల‌వ్‌స్టోరీలు... ఆమె అత‌డితో.. అత‌డు ఆమెతో...!

హృతిక్‌, సుసానే కొత్త ల‌వ్‌స్టోరీలు… ఆమె అత‌డితో.. అత‌డు ఆమెతో…!

బాలీవుడ్‌లో ప్రేమ‌లు, పెళ్లిల్లు, డేటింగ్‌లు కామ‌న్ అయిపోయాయి. పెళ్ల‌య్యి 20 ఏళ్లు కాపురం చేశాక కూడా చాలా జంట‌లు సింపుల్‌గా విడిపోతున్నాయి. అప్ప‌టికే వాళ్లు మ‌రో బంధం మోజులో ఉండ‌డంతో పాట త‌మ భార్య లేదా భ‌ర్త‌ను సింపుల్‌గా వ‌దిలించేసుకుంటున్నారు. మ‌లైకా అరోరాకు ఏం త‌క్కువ అయ్యింద‌ని.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను , మొగుడిని వ‌దిలేసి త‌న కంటే ప‌దేళ్ల వ‌య‌స్సులో ఉన్న అర్జున్ క‌పూర్‌ను ఉంచుకుంది. ఈ వ‌య‌స్సులో కూడా కొత్త కోరిక‌లు, కొత్త బంధాల మోజులో ప‌డి త‌మ వైవాహిక బంధాల‌ను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అయితే మ‌రో ఐదారేళ్లు ఆగి ముస‌లిత‌నం వ‌చ్చి వీరి మీద కొత్త ప్రేమికుల‌కు వెగ‌టు ప‌డితే కాని అప్పుడు ఆ బాధ తెలిసిరాదు.

ఇక క‌హానా ఫ్యార్ హై సినిమాతో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ స్టార్‌గా మారిన హృతిక్ రోష‌న్ ఆ సినిమా త‌ర్వాతే త‌న చిన్న‌నాటి స్నేహితు రాలు అయిన సుసానే ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె బాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సంజ‌య్ ఖాన్ కుమార్తె. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టారు. 15 ఏళ్ల‌కు పైగా కాపురం చేశారు. త‌ర్వాత గ్యాప్ రావ‌డంతో విడిపోయారు. వీరు విడిపోవ‌డానికి కార‌ణాలు ఏవైనా హృతిక్‌కు కంగ‌నాతో ఎఫైర్ ఉంద‌న్న టాక్ ఉంది. అటు సుసానేకు బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్‌తో ఏదో ఉంద‌న్న గుస‌గుస‌లు వ‌చ్చాయి. పోనీ వీళ్లిద్ద‌రు వాళ్ల‌తోనూ లేరు.

ఇప్పుడు హృతిక్ ఓ అమ్మాయితో ఉంటున్నాడు.. డేటింగ్.. పెళ్లి కూడా అంటున్నారు. అటు సాసానే కూడా మ‌రో వ్య‌క్తితో పీక‌ల్లోతు డేటింగ్‌లో ఉంది. హృతిక్ గ‌త కొంత కాలంగా అప్‌క‌మింట్ న‌టి అయిన స‌బా ఆజాద్‌తో ప్రేమ‌లో మునిగి తేలుతున్నాడు. స‌బాను త‌న ఇంటికి తీసుకు వెళ్లి త‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా ప‌రిచ‌యం చేశాడు. అయితే వ‌య‌స్సులో హృతిక్ కంటే స‌బా ప‌దేళ్ల‌కు పైగానే చిన్న‌ది. యేడాది కాలంగా వీరిద్ద‌రు రిలేష‌న్‌లో ఉన్నారు.

ఇక సుసానే ఖాన్ విష‌యానికి వ‌స్తే సుసానే – అర్స్లాన్ గోనీ కొంత కాలంగా కలిసే ఉంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఒక‌రిని ఒక‌రు ఫాలో అవుతూ కామెంట్ల‌తోనే త‌మ ఇష్టాన్ని చెప్పుకుంటున్నారు. వీరిద్ద‌రు తాజాగా ముంబైలోని విమానాశ్ర‌యంలో ఒక‌రి చేతిలో మ‌రొక‌రు చేయి వేసి బ‌య‌ట‌కు వ‌స్తోన్న స్టిల్స్ కూడా వైర‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రు కూడా ఫుల్ డేటింగ్‌లో ఉండ‌డంతో పాటు ట‌ర్కీ, ఇత‌ర దేశాల ప‌ర్య‌ట‌న‌ల్లో క‌నిపిస్తున్నారు.

ఏదేమైనా ఇన్నేళ్లు కాపురం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అయ్యాక కూడా విడిపోయిన సుసానే, హృతిక్ మ‌ళ్లీ ఇప్పుడు కొత్త తోడుల‌ను వెతికేసుకున్నారు. ఈ బంధాలు ఎన్ని రోజులు ఉంటాయి.. ఎంత కాలం వీరు ఈ రిలేష‌న్ల‌లో ఉంటారు ? పెళ్లి వ‌ర‌కు వెళ‌తారా ? ఇక్క‌డితో స‌రిపెట్టేస్తారా ? అన్న‌ది చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news