విమలా రామన్ స్వతహాగా ఇండియా అమ్మాయే. అయితే ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించి అక్కడే కొద్ది రోజులు ఉంది. తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత చిన్న చిన్నగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కొన్ని సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ల సినిమాల్లో ఛాన్సులు అయితే రాలేదు. మళయాళం ఇండస్ట్రీలో ముందుగా కాలు మోపినా ఆ తర్వాత తెలుగులో గాయం – 2, చట్టం , ఎవరైనా.. ఎపుడైనా, రాజ్ సినిమాలు చేసింది.
మధ్యలో అవకాశాలు లేకపోవడంతో అసలు ఆమె ఏమైపోయిందో కూడా ఎవ్వరికి గుర్తు లేదు. కోలీవుడ్లోకి వెళ్లి అక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆమె గురించి మరో ఇంట్రస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. ఆమె త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె అతడితోనే మూడు ముళ్లు వేయించుకోబోతోందట.
వినయ్ రాయ్ అనే తమిళ నటుడిని విమలా రామన్ ప్రేమిస్తోంది. గత కొంత కాలంగా వీరు సహజీవనం కూడా స్టార్ట్ చేసేశారు. చెన్నైలోనే వీరు కలిసి ఉంటున్నారట. అయితే వీరు సహజీవనానికి ఫుల్స్టాప్ పెట్టేసి.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో భార్య భర్తలు అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. వినయ్ రాయ్, విమలా రామన్ పలుమార్లు మీడియా కెమేరాలకు ఓపెన్‌గానే చిక్కేశారు. చెన్నైలో అప్పుడప్పుడు పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు.
మల్దీవుల్లో వీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసే ఫోటోలను కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక విచిత్రం ఏంటంటే విమల పెళ్లాడబోయే వినయ్ కోలీవుడ్ సినిమాల్లో విలన్. పలు సినిమాల్లో విలన్ పాత్రల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. వినయ్ రాయ్ డిటెక్టివ్ – చంద్రకళ – వరుణ్ డాక్టర్ సినిమాల్లో విలన్‌గా నటించి పాపులర్ అయ్యాడు. చెన్నైలో ఉన్నప్పుడే వీరి ప్రేమ చిగురించింది. మొత్తానికి అలా హీరోయిన్ కాస్తా విలన్‌ను పెళ్లాడేస్తోంది.
View this post on Instagram