ఎస్ త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తంగా చాటాడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి దెబ్బతో మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాస్త టెన్షన్‌లోనే ఉన్నాడట. ఇది నిజమే అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. అసలు కథ ఏంటంటే రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ఆ వెంటనే ఎంత పెద్ద హీరోతో సినిమా చేసినా అట్టర్ ప్లాప్ అవుతుంది.
ఈ సెంటిమెంట్ దెబ్బకు ఎంతో మంది హీరోలు కుదేలైపోయారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, సునీల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి రాజమౌళి తన సినిమాతో బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ హీరోలు చేసే సినిమా ఘోరమైన ప్లాప్ అవుతుంది. స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఎన్టీఆర్‌కు సుబ్బు డిజాస్టర్. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా ఘోరమైన ప్లాప్. మగధీర తర్వాత చెర్రీకి ఆరెంజ్ పెద్ద ప్లాప్.
ఇక సై తర్వాత నితిన్‌కు చాలా రోజులు హిట్ లేదు. మర్యాద రామన్న తర్వాత సునీల్‌కు ఇప్పటకీ హిట్ లేదు. ఛత్రపతి తర్వాత ప్రభాస్‌కు ఎన్నో ప్లాపులు.. విక్రమార్కుడు తర్వాత రవితేజ పరిస్థితి అంతే..! ఇక బాహుబలి తర్వాత మాత్రం ప్రభాస్‌కు సాహో, రాధేశ్యామ్ కలిసి రాలేదు. ఈగ తర్వాత నానికి ప్లాపులు పడ్డాయి. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్‌తో సూపర్ హిట్ కొట్టేశామని తారక్, చెర్రీ సంబరాలు చేసుకుంటున్నా.. వీరి నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటన్న టెన్షన్ బాగా ఉంది.
విచిత్రం ఏంటంటే త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల నెక్ట్స్ సినిమాలు కొరటాలవే. ముందుగా ఈ టెస్ట్ చెర్రీ ఎదుర్కోనున్నాడు. ఆచార్య ఈ నెల 29న వస్తోంది. రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఆచార్య ప్లాప్ అవ్వాలి. అందుకే ఇప్పుడు కొరటాలకు నిద్రలేని రాత్రులేనట. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు కూడా కొరటాలే దర్శకుడు.
ఎన్టీఆర్ సినిమా అంటే ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదు. ఇప్పుడు ఆచార్య ఏం చేస్తుందో ? అన్న టెన్షన్ కొరటాలకు మాత్రమే కాదు.. ఇటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఉంది. ఏదేమైనా ఆచార్య హిట్ అయితే.. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన డైరెక్టర్‌గా కొరటాల చరిత్రలో నిలుస్తాడు. కొరటాలకు ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను అన్నీ హిట్లే పడ్డాయి. మరి ఈ సారి ఆచార్యతో ఏం చేస్తాడో ? చూడాలి.