కోలీవుడ్‌లో జీవా పక్కన ముగమూడి (తెలుగులో ‘మాస్క్’) అనే తమిళ ప్లాప్ సినిమాతో హీరోయిన్ అయ్యింది పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే తెలుగులో నాగచైతన్య పక్కన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు కాలం కలిసి వచ్చింది. కేవలం తెలుగు సినిమాలే ఆమెను స్టార్ హీరోయిన్ను చేశాయి. బాలీవుడ్లో హృతిక్ రోషన్ లాంటి వాళ్ల పక్కన ఆమె నటించినా ఆ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. తెలుగులో వరుస హిట్లతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఒకప్పుడు సినిమాకు రు. 30 – 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా రు. 3 కోట్లు డిమాండ్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న ఆమె ఇప్పుడు స్టార్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది. అయితే ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనే.. ! అయితే ఇప్పుడు అదే తెలుగు సినిమాలు.. తెలుగు స్టార్ హీరోలు అంటే పూజా చులకనగా చూస్తోందట.
పూజ సౌత్‌లో పెద్ద సినిమాలే చేస్తోంది. కానీ ప్రమోషన్లలో కనపడడం లేదు. ఇప్పుడు బాలీవుడ్లో ఛాన్సులు రావడంతోనే ఆమె సౌత్ సినిమాలను చిన్న చూపు చూస్తోందని అంటున్నారు. పైగా పెద్ద హీరోల పక్కన నటిస్తున్నా.. వారితో పోలిస్తే తానేం తక్కువ అన్నట్టుగానే బిహేవ్ చేస్తోందట. అందుకే రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్‌కు, ఆమెకు పెద్ద గొడవైందని వార్తలు వచ్చాయి.
ఇక షూటింగ్‌కు కూడా సరైన టైంకు రావడం లేదని కంప్లైంట్లు తెలుగులో ఎక్కువే వినిపిస్తున్నాయి. పైగా హీరోలతో గొడవలు.. ప్రమోషన్లకు రాకపోవడం.. దీంతో పాటు కొత్తగా హీరోలతో సమానంగా తన క్యారెక్టర్ ఉండేలా ఫుష్ చేయాలంటూ దర్శకులకు కొత్తగా కండీషన్లు కూడా పెడుతోందట. పూజ ఇంతలా పేట్రేడిపోవడానికి కారణం.. ఆమె కాల్షీట్ల కోసం సౌత్ వాళ్లు అందరూ వెంటపడడమే..!
ప్రస్తుతం ఆమె ఈ నెల 29న ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతకంటే ముందు విజయ్ బీస్ట్‌తో సౌత్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక మహేష్ – త్రివిక్రమ్ 28వ సినిమాలోనూ ఆమే హీరోయిన్. ఒక్క త్రివిక్రమ్‌తోనే ఆమె ఏకంగా మూడో సినిమా చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ లో పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు.
సౌత్‌లోనే ఆమె ఇంత స్ట్రాంగ్ లైనప్‌తో ఉంది. ఇక బాలీవుడ్లో తీసుకుంటే రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న సర్కస్ సినిమా చేస్తోంది. అలాగే కండలవీరుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో కూడా ఆమె వర్క్ చేయనుందట. అందుకే పూజ కొండెక్కి కూర్చొని సౌత్ సినిమాను చిన్న చూపు చూస్తోన్న పరిస్థితి.