టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ త్రిబుల్ ఆర్. మూడేళ్ల పాటు దర్శకధీరుడు రాజమౌళి ఓ శిల్పంలా చెక్కిన ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో త్రిబుల్ ఆర్ జనాల దృష్టి ఆకర్షించింది.
సినిమాకు ఫస్ట్ డే కొందరి నోటి వెంట మిక్స్డ్ టాక్ వినిపించింది. అయితే రాజమౌళి బాహుబలి పార్ట్ 1కు కూడా ఇదే టాక్ వచ్చింది. నార్త్‌లో కూడా సినిమా ఎక్కదేమో అన్నారు. ఇందుకు కారణం ప్రి రిలీజ్ బుకింగ్స్ వీక్‌గా ఉండడం. అయితే నార్త్‌లో కూడా కేవలం ఐదు రోజులకే ఈ సినిమా రు. 107 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టేసింది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే వచ్చేయడం విచిత్రం.
ఓ వైపు త్రిబుల్ ఆర్ ఇప్పటికే రు. 600 కోట్ల వసూళ్లు దాటేసి థియేటర్లలో విధ్వంసం క్రియేట్ చేస్తోంది. ఈ టైంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు నెలలకు అంటే మే 25వ తేదీన స్ట్రీమింగ్ అవ్వబోతోందన్న టాక్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ 5 మరియు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశాయి.
ఇంత పెద్ద హిట్ సినిమాను ఇంత స్పీడ్‌గా స్ట్రీమింగ్ చేయడం ఏంటన్న ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఇక ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, డివివి దానయ్య భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు.