పారితోషికం విషయంలో అన్నగారు ఎన్టీఆర్ ఎప్పుడూ రాజీపడలేదు. ఆదిలో ఆయన సినీ రంగంలోకి వెళ్లినప్పుడు.. జీతాలు ఉండేవి. తర్వాత.. తర్వాత.. పరిస్తితిలో మార్పు వచ్చింది. సినిమాలకు ఇంత అని తీసుకునే స్థాయికి అన్నగారు ఎదిగారు. 1960లకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టూడియోల డిమాండ్ స్థానం నుంచి హీరోలు, హీరోయిన్ల డిమాండ్లకు పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అన్నగారు సినిమాకు అప్పట్లోనే రు. 2000 నుంచి 3000 తీసుకున్నారట.
అయితే.. సాధారణంగా ఏ సినిమా అయినా.. హీరోకు ఎక్కువగా రెమ్యునరేషన్ ఉంటుంది. తర్వాత.. డైరె క్టర్, హీరోయిన్.. మ్యూజిక్ డైరెక్టర్, ప్రతినాయకుడు.. ఇలా వారి వారి పాత్రలను బట్టి రెమ్యూనరేషన్ నిర్ణ యిస్తారు. ఇక అప్పట్లో ఇండస్ట్రీని ఏలిన ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతే హీరోయిన్ల రెమ్యునరేషన్లు ఉండేవి.
కానీ, ఒక దశలో అన్నగారి హవా కన్నా కూడా హీరోయిన్‌గా ఉన్న భానుమతి హవా పెరిగిపోయిం ది. సావిత్రి, రాజసులోచన.. ఇలాంటి వారు అన్నగారి కన్నా తక్కువ తీసుకునేవారు. లేదా నిర్మాతలు ఎంత ఇస్తే.. అంత సర్దుకునేవారు.
కానీ, అంజలి, భానుమతి మాత్రం తమ రెమ్యూనరేషన్‌ను తామే నిర్ణయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా.. 1966లో వచ్చిన.. పల్నాటి యుద్ధం సినిమాలో అన్నగారి రెమ్యునరేషన్ 5000. ఇప్పటితో పోలిస్తే.. ఒకరకంగా.. పది కోట్లు అనుకోవచ్చేమో! అయితే.. ఇదే సినిమాలో నటించిన భానుమతి రెమ్యునరేషన్ 6000. ఈ విషయం అన్నగారికి తెలిసి.. నిర్మాతను ప్రశ్నించారట. ఇదేం సంప్రదాయం.. మమ్మల్ని తక్కువ చేస్తారా? అని! అయితే.. భానుమతి పరిస్థితి అంతే! అని నిర్మాత వెల్లడించాడట.
అయినా.. అన్నగారు ఆవేదన చెందుతున్నారని తెలిసి… మరో 100 అన్నగారి చేతిలో పెట్టారట. అప్పట్లో ఇది పెద్ద హిస్టరీగా మారింది. తర్వాత తర్వాత అన్నగారు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్ రేటు మారుస్తూ.. వచ్చారట. ఏదేమైనా భానుమతి మాత్రం ఒక్కరూపాయి కూడా వదలకుండా.. తీసుకునేవారట. అన్నగారు కూడా అంతే…! అయితే భానుమతి అంటే ఎన్టీఆర్ ఎంతో ఇష్టంతో ఉండేవారు. పైగా బాలయ్య మంగమ్మగారి మనవడు సినిమాలో ఆమె నటించినప్పుడు కూడా భానుమతికి ప్రతి రోజు నమస్కారం చేయడంతో పాటు ఆమె రోజు కారు దిగగానే నువ్వే వెళ్లి డోర్ తీయాలని బాలయ్యకు చెప్పారట. ఇది అప్పట్లో హాట్ టాపిక్ ?