సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా 1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి మహేష్ కెరీర్‌కు మంచి పునాది వేసింది. ఆ తర్వాత రెండు ప్లాపులు యువరాజు, వంశీ. యువరాజు మహేష్ ఇమేజ్‌కు సెట్ కాలేదన్న విమర్శలు వచ్చాయి. ఇక వంశీ డిజాస్టర్. వంశీ సొంత బ్యానర్లో భారీ బడ్జెట్‌తో చేసినా ప్లాప్. దీంతో ఎలాగైనా కసితో హిట్ కొట్టాలని మహేష్, కృష్ణ అందరూ కలిసి మురారి కథ ఓకే చేశారు. అప్పటికే కృష్ణవంశీకి మాంచి క్రేజ్ ఉంది. క్లాస్ ప్రేక్షకుల్లో కృష్ణ వంశీ సినిమా అంటే మామూలు అంచనాలు ఉండేవి కావు.
కథ ఓకే అయ్యాక.. సినిమా తీశారు. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న సోనాలి బింద్రేను పెట్టుకున్నారు.
మురారికి ముందు మహేష్‌కు రెండు ప్లాపులు ఉండడంతో కృష్ణ కూడా చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు షూటింగ్‌లో ఏం జరుగుతుందో ? తెలుసుకుంటూ ఉండేవారు. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. మణిశర్మ పాటలు ఎవర్‌గ్రీన్. అయితే అలనాటి రామచంద్రుడు పాట ఇప్పటకీ పెళ్లి ఫంక్షన్లలో మార్మోగుతూనే ఉంటుంది. ఈ పాటను క్లైమాక్స్ ముందు వద్దని అందరూ చెప్పారట. అయితే కృష్ణ వంశీ మాత్రం పట్టుబట్టి మరీ ఈ పాటను క్లైమాక్స్‌కు ముందు పెట్టించారు.
మన తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం క్లైమాక్స్‌కు ముందు మాస్ సాంగ్ రావాలి.. లేదా డ్యాన్సులతో ఊపు తెప్పించే డ్యూయెట్ అయినా ఉండాలి. కానీ ఈ సాంగ్ వస్తే ప్రేక్షకులు రిసీవింగ్ ఎలా ఉంటుందో ? అన్న డౌట్ మేకర్స్‌తో పాటు యూనిట్ అందరికి ఉంది. వద్దని అందరూ.. కాదు క్లైమాక్స్‌కు ముందే ఈ సాంగ్ ఉండాలని దర్శకుడు కృష్ణవంశీ పట్టుబట్టారు. చివరకు ఈ పంచాయితీ కృష్ణ దగ్గరకు వెళ్లిందట. చివరకు కృష్ణ కూడా కృష్ణవంశీతో అబ్బాయి.. చివర్లో మాస్ సాంగ్ లేకపోతే బాగోదు.. నువ్వు అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు అన్నారట.
చివరకు నిర్మాతలు మాత్రం సాంగ్ వద్దని పట్టుబట్టారు. కృష్ణవంశీ కృష్ణ వద్దకు వెళ్లి సార్ ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఈ సాంగ్ ఇలాగే ఉండనీయడం.. రెండోది ఈ సాంగ్ తీసేసి కమర్షియల్ సాంగ్ మీరే షూట్ చేసుకుని.. సినిమా విడుదల చేసుకోండి.. అప్పుడు సినిమాకు నా పేరు కూడా వద్దని చెప్పేశారట. ఆ సాంగ్ ఉంటే మహేష్ కెరీర్‌లో ఎప్పటకీ గొప్ప సాంగ్‌గా నిలిచిపోతుందని కన్వీన్స్ చేశారట. చివరకు కృష్ణ సాంగ్ ఉంచేందుకే ఇష్టపడ్డారు.
తీరా ఎడిటింగ్ అయ్యాక ఫైనల్ రషెస్ చూసుకుంటే సినిమా రన్ టైం 3.30 గంటలు వచ్చింది. అంటే 210 నిమిషాలు. కృష్ణవంశీ ఏ సీన్ కట్ చేసేందుకు కూడా ఒప్పుకోవడం లేదు. చివరకు మహేష్ కూడా అసలు ఇంత సేపు సినిమా ఎలా ? చూస్తారని అసహనం వ్యక్తం చేశాడట. కొన్ని సీన్లు కట్ చేసి సినిమా రిలీజ్ చేశారు. 2001 ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి టాకే వచ్చింది. అయితే ఫస్ట్ డే నాలుగు షోలు వేయడం గగనమైపోయింది. ఇందుకు కారణం రన్ టైం 3 గంటలు దాటిపోయి ఉండడం.. ఇది మేజర్ కంప్లైంట్ అయిపోయింది.
ఇలా అయితే రీపీటెడ్ ఆడియెన్స్ ఉండరని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల నుంచి నిర్మాతలకు ఒక్కటే ఫోన్లు… చివరకు రెండో వారంలో కొన్ని సీన్లు దర్శకుడికి చెప్పకుండానే హీరో మహేష్‌కు చెప్పి కట్ చేసేశారు. దీంతో కృష్ణవంశీ బాగా ఫీలయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఈ వివాదం నడిచింది. అయితే సీన్లు కట్ చేశాక సినిమా స్లోగా ఫ్యామిలీ, యువతకు ఎక్కింది. సూపర్ హిట్ అయ్యింది.