దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన శిల్పం త్రిబుల్ ఆర్. మూడేళ్ల పాటు రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రాజమౌళి చెక్కిన ఈ శిల్పం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా మూడు రోజులకే రు. 500 కోట్ల వసూళ్లు రాబట్టేసింది. ఇటు ఓవర్సీస్లో ఏకంగా 9.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోయింది. అసలు లాంగ్ రన్లో త్రిబుల్ ఆర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఈ ఊచకోత బాహుబలి 2 రికార్డులకు కూడా చెక్ పెట్టేస్తుందా ? లేదా ? అన్నది సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.
ఇక ఈ సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ఎన్టీఆర్ కొమరం భీంగాను, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగాను కనిపించారు. సినిమా చూసిన వాళ్లలో కొందరు రామ్‌చరణ్ క్యారెక్టర్‌కు కాస్త ప్రాధాన్యం ఎక్కువ ఉందని అంటున్నారు. అయితే వాస్తవంగా నటనా పరంగా ఎన్టీఆర్ లెవల్ తో ఆ లెక్క సరి చేశాడన్నది చెప్పాలి. చరణ్‌కు ఒకటి రెండు నిమిషాలు స్క్రీన్ స్పేస్ ఉన్నా నటనలో ఎన్టీఆర్ అరివీర భయంకరంగా విజృంభించాడనే చెప్పాలి.
ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా త్రిబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇద్దరు హీరోలపై కూడా టాలీవుడ్ టు బాలీవుడ్ వైజ్‌గా కూడా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి గొప్ప సినిమా అందించిన మేకర్స్‌కు, తన తోటి నటీనటులకు మొత్తం టీంకు థ్యాంక్స్ చెపుతూ ఎన్టీఆర్ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి ధన్యవాదాలు తెలిపాడు. అసలు ఇది ప్రెస్ నోట్ అనడం కంటే.. ఇందులో మెసేజ్ చాలా ఎమోషనల్‌గా ఉంది.
ముందుగా తన దర్శకుడు జక్కన్నకు ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్… ఇలాంటి గొప్ప పాత్ర తనకు ఇచ్చినందుకు ఎప్పటకీ రుణపడి ఉంటానని… నా బ్రదర్ రామ్‌చరణ్ లేకుండా ఈ సినిమాను అస్సలు ఊహించుకోలేనని.. రామరాజు పాత్ర గాని.. భీమ్ గాని నువ్ లేనిదే లేవు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే సినిమాలో సెకండాఫ్‌లో కీలక పాత్రలో కనిపించిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తన హీరోయిన్ ఒలీవియా మోరిస్, ఇతర నటీనటులు, నిర్మాత దానయ్య, రైటర్ విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ .. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇలా.. సినిమా కోసం తమతో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు.
View this post on Instagram